Telecom Industry: లైసెన్స్ ఫీజులు త‌గ్గించాలి… జీఎస్టీని ర‌ద్దు చేయాల‌ని టెలికాం కంపెనీల డిమాండ్‌…

| Edited By:

Jan 25, 2021 | 6:59 PM

బడ్జెట్‌లో లైసెన్స్‌ ఫీజులను తగ్గించాలని, జీఎస్టీని రద్దు చేయాలని టెలికాం కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. బ‌డ్జెట్లో...

Telecom Industry: లైసెన్స్ ఫీజులు త‌గ్గించాలి... జీఎస్టీని ర‌ద్దు చేయాల‌ని టెలికాం కంపెనీల డిమాండ్‌...
Follow us on

బడ్జెట్‌లో లైసెన్స్‌ ఫీజులను తగ్గించాలని, జీఎస్టీని రద్దు చేయాలని టెలికాం కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. బ‌డ్జెట్లో పన్ను భారం ఉంటుంద‌న్న నేప‌థ్యంలో టెలికాం పరిశ్రమ ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తోంది. బడ్జెట్‌లో ఉపశమనాన్ని ఆశిస్తోంది. టెలికాం కంపెనీలు తమపై భారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. లైసెన్స్‌ ఫీజును 8 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని టెలికాం కంపెనీలు కోరుతున్నాయి. ఇక మూడు శాతం చొప్పున చెల్లిస్తోన్న స్పెక్ట్రం వినియోగ ఛార్జీని కూడా తగ్గించాలన్న డిమాండ్‌ ఉంది. ఇదికాకుండా, స్పెక్ట్రం ఆర్జన ఛార్జీపై ప్రత్యేక జీఎస్‌టీని తొలగించాలని డిమాండ్‌ వినిపిస్తోంది.