Hyderabad: పురుషుల కోసం ప్రత్యేక బస్సులు.. కట్‌ చేస్తే.. వారంలోనే నిలిపివేత.. ఎందుకంటే

|

Feb 05, 2024 | 11:27 AM

ఈ బస్సుకు పురుషులకు మాత్రమే అనే బోర్డును తగిలించడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికైనా మంచి రోజులు వచ్చాయంటూ పురుషులు తెగ సంబరపడిపోతున్నారు. పురుషుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ బస్సు వారం గడవకముందే పురుషులను నిరుత్సాహపరిచింది. వారంలో రెండు రోజులు మాత్రమే ఈ బస్సును నడిపిన ఆర్టీసీ.. రద్దు చేసేసింది..

Hyderabad: పురుషుల కోసం ప్రత్యేక బస్సులు.. కట్‌ చేస్తే.. వారంలోనే నిలిపివేత.. ఎందుకంటే
Tsrtc
Follow us on

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిననాటి నుంచి రోజుకో రచ్చ జరుగుతోంది. ప్రతి బస్సులో మహిళలే ఉండటంతో పురుషుల ప్రయాణానికి ఇబ్బందిగా మారుతోంది. ఏ బస్సులో చూసినా సీట్లన్ని మహిళలతోనే దర్శనమిస్తుండటంతో మగవారు నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. అంతేకాదు మహిళలు సైతం ఒకరిపై ఒకరు ఘర్షణలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో పురుషుల కోసం ప్రత్యేక బస్సు కావాలని డిమాండ్‌ పెరుగుతుండటంతో ఆర్టీసీ స్పందించింది. పురుషుల కోసం ప్రయోగాత్మకంగా ఓ బస్సును ఏర్పాటు చేసింది. అది కూడా హైదరాబాద్‌లోని రూట్‌ నంబర్‌ 277లో ఎల్‌బీనగర్‌ – ఇబ్రాహీంపట్నం వరకు పురుషుల కోసం ఓ ప్రత్యేక బస్సును అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ బస్సుకు పురుషులకు మాత్రమే అనే బోర్డును తగిలించడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికైనా మంచి రోజులు వచ్చాయంటూ పురుషులు తెగ సంబరపడిపోతున్నారు. పురుషుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ బస్సు వారం గడవకముందే పురుషులను నిరుత్సాహపరిచింది. వారంలో రెండు రోజులు మాత్రమే ఈ బస్సును నడిపిన ఆర్టీసీ.. రద్దు చేసేసింది. ఈ అందుకు కారణం లేకపోలేదు. పరుషుల కోసం నడిపిన ఈ బస్సుకు పెద్దగా ఆదరణ లేకపోవడం వల్లే ఈ బస్సును నిలిపివేసినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

పురుషుల కోసం కేటాయించిన ఈ బస్సు కోసం ఎదురు చూడకుండా ముందుగా వచ్చిన బస్సులోనే ఎక్కి వెళ్తున్నారని, ఈ ప్రత్యేక బస్సులో పెద్దగా ఎవ్వరు కూడా ఎక్కడ లేదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

పురుషుల కోసం కేటాయించిన ఈ బస్సుకు ఆదరణ అంతగా లేదు అని ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన ఒక అధికారి ధృవీకరించారు. విద్యార్థులు సైతం ముందు వచ్చిన బస్సులోనే వెళ్తున్నారని చెబుతున్నారు. అయితే మహిళలు ఉచిత ప్రయాణం కల్పించగా, మగ విద్యార్థుల కోసం సిటీ ఆర్డినరీ బస్సులను ఉచితంగా అందించాలని ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి చెప్పాడు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇబ్రహీంపట్నంలోని కాలేజీల క్లస్టర్లకు 85 ట్రిప్పులను తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి