భారత్‌లోకి టెస్లా కార్ల ప్రవేశంపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో ఎదురువుతోన్న సవాళ్ల కారణంగానే ఇండియాకు టెస్లా రాక ఆలస్యమవుతోందని మస్క్ ట్విట్టర్ లో ఆరోపించారు. అయితే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలన్ చేసిన వ్యాఖ్యలపై చాలామంది మండిపడుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ టెస్లా అధినేత వ్యాఖ్యలపై స్పందించారు. ముందుగా భారత్ లో తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభిస్తున్నందుకు మస్క్‌కు ధన్యవాదాలు చెప్పిన ఆయన.. ఆతర్వాత తెలంగాణ/ ఇండియాలో పరిశ్రమల అభివృద్ధికి బోలెడు అవకాశాలున్నాయన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిరత విషయాల్లో తెలంగాణ ఛాంపియన్‌గా నిలిచిందన్నారు. దేశంలో తమ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ఉందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు కేటీఆర్.
అసలు ఏం జరిగిందంటే..
మార్కెట్ పరంగా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద విపణి కలిగిన భారత్‌లో తమ కార్లను ప్రవేశపెట్టేందుకు టెస్లా అధినేత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఈ విషయంపై భారత ప్రభుత్వం, మస్క్ మధ్య చర్చలు జరుగుతున్నా ఓ కొలిక్కి రావడం లేదు. ఇందుకు ఎలన్ విధించిన షరతులే కారణమని తెలుస్తోంది. మొదట విదేశాల్లో తయారుచేసిన కార్లను ఇండియాలో ప్రవేశపెడతామని, ఆతర్వాతే తయారీ యూనిట్ నెలకొల్పుతామని మస్క్ కండిషన్ పెట్టాడు. దీంతో పాటు కార్ల దిగుమతిపై సుంకాన్ని కూడా తగ్గించాలని కోరాడు. దీనిపై ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో భారత మార్కెట్లో టెస్లా కార్ల విడుదలపై ఓ నెటిజన్ ‘ టెస్లా కార్లు బాగుంటాయి.. ఇండియాలో వీటి విడుదలపై ఏమైనా అప్డేట్ ఉందా?’ అని మస్క్ ను ట్యాగ్ చేస్తూ ఆసక్తికర ప్రశ్న సంధించాడు ఓ నెటిజన్. దీనిపై స్పందించిన మస్క్ ‘ భారత ప్రభుత్వంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఇప్పటికీ దీనిపై ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. మస్క్ ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై మస్క్ ఒత్తిడి తీసుకొస్తున్నారని జాతీయ మీడియాల్లో కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు కేటీఆర్ కూడా మస్క్ వ్యాఖ్యలపై స్పందించారు.
Hey Elon, I am the Industry & Commerce Minister of Telangana state in India
Will be happy to partner Tesla in working through the challenges to set shop in India/Telangana
Our state is a champion in sustainability initiatives & a top notch business destination in India https://t.co/hVpMZyjEIr
— KTR (@KTRTRS) January 14, 2022
Malaika Arora: రూమర్స్ పై స్పందించిన మలైకా.. జీవితం అయిపోదంటూ..
Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..