Voter ID: ఓటరన్నా..నీకు ఓటర్‌ ఐడి కార్డు లేదా? ఇలా చేస్తే సులభంగా మీ ఇంటికొస్తుంది

|

Mar 18, 2024 | 5:22 PM

2024 లోక్‌సభ ఎన్నికల తేదీని ప్రకటించారు. ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, ఏప్రిల్ 19 నుంచి ఓటింగ్ ప్రారంభం కానుంది. ఫలితాలు జూన్ 4, 2024న రానున్నాయి. 17వ లోక్‌సభ పదవీకాలం జూన్ 16, 2024తో ముగుస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. మీరు ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటరు జాబితాలో మీ పేరు ఉండాలి. లేకుంటే ఎన్నికల్లో ఓటు వేయలేరు..

Voter ID: ఓటరన్నా..నీకు ఓటర్‌ ఐడి కార్డు లేదా? ఇలా చేస్తే సులభంగా మీ ఇంటికొస్తుంది
Voter Id
Follow us on

2024 లోక్‌సభ ఎన్నికల తేదీని ప్రకటించారు. ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, ఏప్రిల్ 19 నుంచి ఓటింగ్ ప్రారంభం కానుంది. ఫలితాలు జూన్ 4, 2024న రానున్నాయి. 17వ లోక్‌సభ పదవీకాలం జూన్ 16, 2024తో ముగుస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. మీరు ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటరు జాబితాలో మీ పేరు ఉండాలి. లేకుంటే ఎన్నికల్లో ఓటు వేయలేరు. ఇప్పుడు ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల గుమ్మం దాకా తిరగాల్సిన పనిలేదు. ఓటరు కార్డు అవసరమైతే లేదా సవరించినట్లయితే, ప్రక్రియను ఆన్‌లైన్‌లో సులభంగా పూర్తి చేయవచ్చు.

దీని కోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇందులో మీరు మీ పూర్తి సమాచారాన్ని పూరించాలి. అప్పుడు మీ ఇంటి చిరునామాకు కొత్త ఓటరు కార్డు పంపబడుతుంది.

ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్ ఓటరు ఐడీ కార్డ్‌ని రూపొందించడానికి ఆండ్రాయిడ్, iOS మొబైల్‌లో గూగుల్‌ ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌ నుండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ యాప్ సహాయంతో ఆన్‌లైన్‌లో ఓటరు గుర్తింపు కార్డు, సవరణలు చేసుకోవచ్చు.

ముందుగా మొబైల్‌లో ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి. తర్వాత యాప్‌ను ఓపెన్ చేయండి. ఓటరు నమోదుపై క్లిక్ చేయండి. తర్వాత ఓటరు నమోదుకు కావాల్సిన పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఆధార్ కార్డు నంబర్‌ను నమోదు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేయండి. అప్పుడు మిగిలిన ప్రక్రియ బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ (BLO) ద్వారా తనిఖీ చేయబడుతుంది. ఆ తర్వాత మీ ఇంటికి కొత్త ఓటరు గుర్తింపు కార్డు వస్తుంది.

పాత ఓటర్ ఐడీని ఎలా సవరించాలి?

ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా పాత ఓటరు గుర్తింపు కార్డును కూడా సరిచేసుకోవచ్చు. దాని కోసం ఈ అప్లికేషన్ చివరిలో ఫిర్యాదు, రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ కనిపిస్తుంది. మీరు ఈ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో సరైన సమాచారాన్ని సమర్పించాలి. ఈ సమాచారాన్ని సమర్పించిన తర్వాత, కొద్ది రోజుల్లోనే మీ ఇంటికి కొత్త ఓటర్ ఐడీ కార్డు అందుతుంది. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ముందుగా అది ఎన్నికల సంఘం అధికారిక యాప్ అని నిర్ధారించుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి