టాటాకు చెందిన ఫైవ్ స్టార్ తాజ్ హోటల్.. ఇక్కడ భోజనం ఖరీదు ఎంతో తెలుసా?

|

Dec 01, 2024 | 5:28 PM

మహారాష్ట్రలోని ముంబైలో ప్రధాన కార్యాలయం ఉన్న తాజ్ హోటల్ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ హోటళ్లలో ఒకటి. తాజ్ దేశంలోనే మొదటి ఫైవ్ స్టార్ హోటల్. తాజ్‌హోటల్‌కి సంబంధించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఫైవ్ స్టార్ హోటల్ లో తింటే ఎంత ఖర్చవుతుందో తెలుసా?

టాటాకు చెందిన ఫైవ్ స్టార్ తాజ్ హోటల్.. ఇక్కడ భోజనం ఖరీదు ఎంతో తెలుసా?
Tata Taj Hotel
Follow us on

భారతదేశంలోని తాజ్ హోటల్స్ ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. ముంబైలోని తాజ్ హోటల్ విదేశీయులకు అత్యంత ప్రసిద్ధ భారతీయ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. తాజ్ కీర్తి వెనుక సామాన్యుల కోసం జీవించిన రతన్ టాటాకు చెందినది. టాటా కంపెనీ అయినప్పటికీ, తాజ్ హోటల్ చాలా మందికి ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉంది. తాజ్ హోటల్ నాణ్యతే ఇందుకు కారణం. ఇక్కడ భోజనం ఖరీదు ఎంతో ఇక్కడ తెలుసుకుందాం..

తాజ్ హోటల్ 1903 డిసెంబర్ 16న ముంబైలో ప్రారంభమైంది. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా దీన్ని ప్రారంభించారు. 2008 నవంబర్ 26న ముంబై ఉగ్రవాద దాడిలో తాజ్ హోటల్ దెబ్బతిన్నది. ఆ రోజు జరిగిన ఉగ్రదాడిలో చారిత్రక తాజ్ హోటల్ తీవ్రంగా ధ్వంసమైంది. తాజ్‌ను తిరిగి పూర్వ వైభవానికి తీసుకురావడానికి అపారమైన అంకితభావం, శక్తిని చూపించినది రతన్ టాటా. ఆ రోజు తర్వాత టాటా హోటల్‌ను పునర్నిర్మిస్తానని, దాడిలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

తాజ్ మహల్ ప్యాలెస్ ఒక సాంప్రదాయ, ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్. ఇది భారతదేశంలోని మహారాష్ట్రలోని ముంబైలోని కోలాబా ప్రాంతంలో గేట్‌వే ఆఫ్ ఇండియా పక్కన ఉంది. ఇండో-సార్సెనిక్ శైలిలో నిర్మించబడింది. ఇది 1903లో తాజ్ మహల్ హోటల్‌గా ప్రారంభించబడింది. దీనిని చారిత్రాత్మకంగా తరచుగా తాజ్ అని పిలుస్తారు. ముంబైకి దాదాపు 1,050 కిలోమీటర్ల దూరంలో ఆగ్రా నగరంలో ఉన్న తాజ్ మహల్ పేరు మీద ఈ హోటల్ పేరు పెట్టబడింది. బ్రిటీష్ కాలం నుండి తూర్పున ఉన్న ఉత్తమ హోటళ్లలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. తాజ్ హోటల్ రిసార్ట్స్‌లో 600 గదులు ఉన్నాయి. 44 గదులు ప్యాలెస్‌లలో భాగంగా ఉన్నాయి. ఇది టాటా గ్రూప్ ప్రధాన ఆస్తిగా పరిగణించబడుతుంది. ఇందులో 1,600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. హోటల్ రెండు విభిన్న నిర్మాణాలతో రూపొందించబడింది. తాజ్ మహల్ ప్యాలెస్, టవర్, ఇవి చారిత్రాత్మకంగా, నిర్మాణపరంగా విభిన్నంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, నివేదికల ప్రకారం తాజ్ హోటల్‌లో ఒక్క భోజనం ఖరీదు రూ.13,000. నాన్ ఆల్కహాల్ డ్రింక్స్ ఆర్డర్ చేస్తే 300 నుంచి 500 రూపాయల వరకు ఖర్చవుతుంది. తాజ్‌లో ఒక్కో భోజనం రూ.10,000. ఇది కాకుండా సేవా పన్ను రూ.1,000, జీఎస్టీ రూ.1,800. అంటే ఉదయం ఒకరి భోజనం ఖరీదు రూ.12,800. మద్యం ధర 1000 నుండి 3000 రూపాయల వరకు ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..