TATA vs Maruti: బడ్జెట్ కార్ల సెగ్మెంట్‌లో పోటాపోటీ.. ది బెస్ట్ కారు ఏదంటే?

భారతదేశంలో జనాభాపరంగా ముందు వరుసలో ఉంటుంది. ఈ జనాభాలో కూడా మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబాలకు సొంత కారు అనేది ఓ కల. కాబట్టి ఇలాంటి మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు అన్ని కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు అయిన టాటా మోటర్స్, మారుతీ సుజుకీ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను రిలీజ్ చేశాయి. ముఖ్యంగా టాటా టియాగోతో మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ పోటీ పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు కార్ల మధ్య ఉన్న ప్రధాన తేడాలను తెలుసుకుందాం.

TATA vs Maruti: బడ్జెట్ కార్ల సెగ్మెంట్‌లో పోటాపోటీ.. ది బెస్ట్ కారు ఏదంటే?
Tata Tiago Vs Maruti Suzuki Wagon R

Updated on: May 16, 2025 | 7:30 AM

టాటా టియాగో బేస్ వేరియంట్ ధర రూ.5.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ బేస్ వేరియంట్ ధర రూ.6.60 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే టాటా టియాగో, మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ రెండూ అధునాతన ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. టాటా టియాగోలో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇతర ఫీచర్లు ఉన్నాయి. అయితే వ్యాగన్ ఆర్‌లో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

ప్రయాణికుల భద్రత విషయానికి వస్తే టాటా మోటార్స్ టియాగో కారులో ముందు భాగంలో ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈఎస్‌సీ, ట్రాక్షన్ కంట్రోల్, ఇతర భద్రతా లక్షణాలతో ఆకట్టుకుంటుంది. ఈ కారు గ్లోబల్ ఎన్‌సీఏపీలో ఫోర్ స్టార్ భద్రతా రేటింగ్‌ను సాధించింది. మరోవైపు మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ ఇటీవల ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణిక లక్షణంగా అప్ డేట్ చేసింది. అలాగే ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్, ఈఎస్‌సీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 

టాటా టియాగోలో 1.2 ఎల్ ఇన్‌లైన్ త్రీ-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. అందువల్ల 82 బీహెచ్‌పీ శక్తిని 113 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఫైవ్-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అలాగే ఈ కారు ఇంజన్ సీఎన్‌జీ ఎంపికతో కూడా అందుబాటులో ఉంది. మరోవైపు వ్యాగన్ ఆర్ కొనుగోలుదారులు 1.0 ఎల్ ఇన్లైన్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ లేదా 1.2 ఎల్ ఇన్లైన్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ నుంచి నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ గేర్‌బాక్స్‌తో వస్తాయి. అయితే సీఎన్‌జీ ఎంపిక మాత్రం 1.0 ఎల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, టాటా టియాగో రెండూ భారతీయ కొనుగోలుదారుల ప్రసిద్ధ ఎంపికలు అని నిపుణులు చెబుతున్నారు. అయితే కొనుగోలుదారులు మరింత భద్రత, మెరుగైన ఫీచర్లను కోరుకుంటే టాటా టియాగోను పరిగణించడం ఉత్తమమని పేర్కొంటున్నారు. ప్రాధాన్యత విశ్వసనీయత, ఇంజిన్ మెరుగుదల, ఇంధన సామర్థ్యం గురించి కారును కొనుగోలు చేసే వారైతే మారుతి సుజుకి వ్యాగన్ ఆర్‌ను ఎంచుకోవచ్చని పేర్కొంటున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి