Tata Steel: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.9,598.16 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదు చేసుకుంది టాటా స్టీల్. కిందిటి ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,010.94 కోట్ల లాభంతో పోలిస్తే రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. కంపెనీ ఆదాయం భారీగా పెరగడంతో లాభాలు కలిసి వచ్చాయని తెలిపింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.42,152.87 కోట్ల నుంచి రూ.60,842.72 కోట్లకు దూసుకెళ్లినట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. ఇక నిర్వహణ ఖర్చులు రూ.36,492 కోట్ల నుంచి రూ.48,666 కోట్లకు చేరుకున్నాయి టాటా వెల్లడించింది.
గడిచిన త్రైమాసికంలో..
గడిచిన త్రైమాసికంలో క్రూడ్ స్టీల్ ఉత్పత్తి 7.76 మిలియన్ టన్నులకు పెరుగగా, ఏడాది క్రితం ఇది 7.74 మిలియన్ టన్నులుగా ఉన్నట్లు తెలిపింది. ఇక ఇదే త్రైమాసికంలో 7.01 మిలియన్ టన్నుల స్టీల్ విక్రయాలు జరిగాయి. ఈ సందర్భంగా టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ మాట్లాడుతూ.. కరోనా కాలంలో అన్ని రంగాలు నష్టాలు చవి చూశాయని, ఇక దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడు కోలుకుంటుండటంతో స్టీల్‌కు డిమాండ్ పెరిగిందని టాటా తెలిపింది. ఇక సెమికండక్టర్ల కొరత కారణంగా ఆటోమొబైల్ రంగంపై పడిన ప్రతికూల ప్రభావం స్టీల్ రంగంపై కూడా పడిందని, ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో లాభాల వైపు దూసుకెళ్తున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి: