రూ.2లక్షలు ఉంటే చాలు.. ఈ కొత్త కారు మీ ఇంటి ముందు ఉంటుంది..! అద్దిరిపోయే ఫీచర్స్..

టాటా కార్లు వాటి లేటెస్ట్‌ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, పోటీ ధరతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మనం ఒక అద్భుతమైన కారు గురించి తెలుసుకోబోతున్నాం..మీ దగ్గర కేవలం రూ. 2 లక్షలు ఉంటే చాలు.. ఈ కారు మీ ఇంటి ముందుకు వచ్చేస్తుంది. మీరు ఆ కారుకు ఓనర్‌ అయిపోతారు.. అలాంటి సుపర్‌ కారుకు సంబంధించిన పూర్తి డిటెల్స్‌ ఇక్కడ చూద్దాం..

రూ.2లక్షలు ఉంటే చాలు.. ఈ కొత్త కారు మీ ఇంటి ముందు ఉంటుంది..! అద్దిరిపోయే ఫీచర్స్..
Tata Sierra

Updated on: Jan 22, 2026 | 1:58 PM

టాటా మోటార్స్ పాత తరం సియెర్రాను కొత్త లుక్‌తో తిరిగి విడుదల చేసింది. 1990లలో ప్రారంభించబడిన ఈ ఐకానిక్ SUV అప్పటిలాగే నేటికీ ప్రజాదరణ పొందింది. ఇది కొత్త టెక్నాలజీ, ప్రీమియం ఇంటీరియర్స్, ఆధునిక లక్షణాలతో ఆకట్టుకుంటుంది. టాటా సియెర్రా బేస్ మోడల్ ధర రూ. 11.49 లక్షలు. టాప్ మోడల్ ధర రూ. 18.49 లక్షలు. దేశంలోని వివిధ నగరాలు, షోరూమ్‌లను బట్టి ధర అటు ఇటుగా మారవచ్చు. కానీ, మీరు రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించడం ద్వారా ఈ కారును EMI సౌకర్యంపై పొందవచ్చు. సియెర్రాలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 105 bhp, 145 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టాటా సియెర్రా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం, ఎలక్ట్రిక్ వెర్షన్ (టాటా సియెర్రా ఎలక్ట్రిక్) అందుబాటులోకి రానుంది. ఈ కారు సున్నితమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది SUV అనుభవాన్ని పొందేలా చేస్తుంది. ఈ కారులో కూర్చోవడం విలాసవంతమైన ఫీలింగ్‌ ఇస్తుంది. హైవేలపై లాంగ్ డ్రైవ్‌లకు ఇది బెటర్‌ అప్షన్‌ అవుతుంది. దీని లుక్స్ కూడా మిమ్మల్నీ ఆకట్టుకునేలా ఉంది.

భారత మార్కెట్లో టాటా సియెర్రా క్రెటా, సెల్టోస్, డస్టర్ వంటి కార్లతో పోటీపడుతుంది. ఈ కారు ధర, మైలేజ్, బ్రాండ్ పరంగా ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది. ఈ కారు కోసం కంపెనీ రెండు ఇంజన్ ఎంపికలను అందిస్తుంది. టర్బో పెట్రోల్, టర్బో డీజిల్ ఇంజన్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజిన్యూస్ కోసం క్లిక్ చేయండి..