ప్రముఖ ఆటో మొబైల్ తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తన మైక్రో ఎస్‌యూవీ పంచ్ కారు కోసం అక్టోబర్ 4 నుంచి బుకింగ్స్ ఉండనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని కంపెనీ ట్వీట్టర్లో పోస్ట్ చేసింది. ఈ మైక్రో ఎస్‌యూవీని 2021 అదే రోజున లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. అయితే, బుకింగ్ మొత్తం ఎంత అనేది టాటా మోటార్స్ ఇంకా వెల్లడించలేదు. ఇండియన్ మార్కెట్‌లో గత కొంత కాలంగా ఎస్‌యూవీ వెహికల్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. సెడాన్‌లకు ధీటుగా ఎస్‌యూవీ వెహికల్స్ అమ్మకాలు సాగుతున్నాయి. అందుకే ఈ కారును మార్కెట్లోకి తీసుకొస్తుంది.
టాటా మోడల్ కార్లలో అందించే 7 అంగుళాల ఫ్రీ స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఇందులో కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎస్‌యూవీ ప్రమాణాలతో, పట్టణాలు, నగరాల్లో ప్రయాణించేందుకు అనువైన చిన్న వాహనంగా దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. స్పోర్టీ త్రీ స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ఆల్ట్రోజ్ నుండి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్విచ్ గేర్ వంటి ఫీచర్లతో రానుంది. పంచ్ తన కీలక ప్రత్యర్థుల్లో ఒకరైన మారుతి సుజుకి ఇగ్నిస్ కంటే పెద్దదిగా ఉంటుందని తెలుస్తుంది. ఇగ్నిస్ కారుతో పోలిస్తే దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీని ధర రూ. 5 లక్షలకు పైగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Read Also.