TATA Group: ఆన్‌లైన్‌ బిజినెస్‌లో మరో భారీ డీల్‌.. బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటాను కొననున్న టాటా గ్రూప్‌..

|

Mar 13, 2021 | 4:06 PM

TATA Group Buy Big Basket: ప్రస్తుతం ఆన్‌లైన్‌ మార్కెట్‌ ఓ రేంజ్‌లో దూసుకెళుతోంది. ఒకప్పుడు ఆన్‌లైన్‌లో వస్తువులు కొనడం ఏంటి.? మనం ఎంచుకున్న వస్తువులు ఇంటికి వస్తాయా.? అని అందరూ అనుమానపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

TATA Group: ఆన్‌లైన్‌ బిజినెస్‌లో మరో భారీ డీల్‌.. బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటాను కొననున్న టాటా గ్రూప్‌..
Tata Bigbasket
Follow us on

TATA Group Buy Big Basket: ప్రస్తుతం ఆన్‌లైన్‌ మార్కెట్‌ ఓ రేంజ్‌లో దూసుకెళుతోంది. ఒకప్పుడు ఆన్‌లైన్‌లో వస్తువులు కొనడం ఏంటి.? మనం ఎంచుకున్న వస్తువులు ఇంటికి వస్తాయా.? అని అందరూ అనుమానపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇంటి పక్కనే సూపర్‌ మార్కెట్ ఉన్నా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టుకునే వారు కూడా ఉన్నారు. అంతలా ఆన్‌లైన్‌ షాపింగ్‌ విస్తరించింది. బడా కంపెనీలు ఈ రంగంలోకి అడుగుపెట్టడం, నాణ్యత, నమ్మకం పెరగడంతో ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ఆధరణ పెరుగుతోంది.

ఈ క్రమంలోనే బడా కంపెనీలు ఆన్‌లైన్‌ మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌ బిజినెస్‌లో ఇలాంటి ఓ భారీ డీల్‌ సెట్‌ కాబోతోంది. ప్రముఖ ఆన్‌లైన్‌ గ్రోసరీ ప్లాట్‌ఫామ్‌ బిగ్‌ బాస్కెట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి టాటా గ్రూప్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాంపిటీషన్‌ కమిషన్‌కు చేసిన దరఖాస్తు ప్రకారం బిగ్‌బాస్కెట్‌లో 64.3 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌ విలువ మన కరెన్సీలో సుమారు రూ.ఏడు వేల కోట్లకుపైమాటే అని తెలుస్తోంది. రానున్న ఏడాదిలో ఈ ఒప్పందం పూర్తి కానుంది. టాటా సన్స్‌కు అనుబంధ సంస్థ అయిన టీడీఎల్‌ టెక్నాలజీస్‌ ఈ వాటాను కొనుగోలు చేయనుంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్కెట్‌ సేవలు భారత్‌లో 2011లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25కిపైగా పట్టణాల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక బిగ్‌బాస్కెట్‌ బాలీవుడ్‌ బడా హీరో షార్‌ఖ్‌ ఖాన్‌తో ప్రచారం చేస్తోన్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ గ్రోసరీ మార్కెట్లో అమెజాన్‌, ఫ్లిక్‌కార్ట్‌, గ్రోఫోర్స్‌ వంటి దిగ్గజ సంస్థలతో బిగ్‌బాస్కెట్ పోటీ పడుతోంది.

Also Read: CredR: బంపర్ ఆఫర్.. 25 వేలకే అదిరిపోయే బైక్‌లు.. స్కూటీలు.. ఎక్కడనుకుంటున్నారు..

Triton Electric Car: భారత్‌లో భారీ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమైన ట్రైటాన్‌.. అమెరికా తర్వాత ఇండియాలోనే..

Second Hand Bikes: సెకండ్ హ్యాండ్ బైక్‌లు కొనాలని చూస్తున్నారా? అలాంటి వారికోసమే ఈ సరికొత్త సమాచారం..