Tata SUV’s: ఆ ఎస్‌యూవీలపై టాటా బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.1.40 లక్షల వరకూ తగ్గింపు

| Edited By: TV9 Telugu

Nov 15, 2023 | 6:28 PM

భారతదేశంలో టాటా కంపెనీ కార్లకు ఉన్న డిమాండ్‌ వేరు. ఆ కంపెనీ కూడా ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఆఫర్లతో మన ముందుకు వస్తుంది. తాజాగా భారతదేశంలో పండుగల సీజన్‌ నడుస్తుంది. ఈ సీజన్‌లో కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి టాటా ఎస్‌యూవీలపై ఆ కంపెనీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

Tata SUV’s: ఆ ఎస్‌యూవీలపై టాటా బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.1.40 లక్షల వరకూ తగ్గింపు
Tata Cars
Follow us on

సొంత కారు అనేది ప్రతి మధ్య తరగతి ఉద్యోగి కల. సొంత కారులో ఇంటెళ్లిపాది సరదాగా బయటకు వెళ్లాలని ఏళ్ల తరబడి కలలు కంటూ ఉంటారు. ఆ కలను నెరవేర్చుకోవడానికి డబ్బును పొదుపు చేసి కారును కొనుగోలు చేస్తూ ఉంటారు. భారతదేశంలో టాటా కంపెనీ కార్లకు ఉన్న డిమాండ్‌ వేరు. ఆ కంపెనీ కూడా ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఆఫర్లతో మన ముందుకు వస్తుంది. తాజాగా భారతదేశంలో పండుగల సీజన్‌ నడుస్తుంది. ఈ సీజన్‌లో కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి టాటా ఎస్‌యూవీలపై ఆ కంపెనీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఆ కార్లపై ఏకంగా రూ.1.40 లక్షల తగ్గింపును అందిస్తుంది. టాటా కంపెనీ ఏయే కార్లపై ఈ ఆఫర్‌ను ఇస్తుందో? ఓసారి తెలుసుకుందాం.

టాటా మోటార్స్‌కు సంబంధించిన హారియర్‌, సఫారీ ఎస్‌యూవీలపై ప్రస్తుతం కంపెనీ పండుగ ఆఫర్లను ప్రకటించింది. ఈ రెండు కార్లపై రూ.1.40 లక్షలు తగ్గింపు పొందవచ్చు. ఈ మొత్తంలో రూ.75 వేల వరకూ ప్రత్యక్ష నగదు తగ్గింపుతో పాటు రూ.50 వేల వరూ ఎక్స్చేంజ్‌ బోనస్‌ను అందిస్తున్నారు. అలాగే ఈ కార్లపై రూ. 15 వేల కార్పొరేట్‌ ఆఫర్లను అందిస్తున్నారు. అయితే ఈ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రీ ఫేస్‌లిఫ్ట్‌ మోడల్స్‌పై మాత్రేమే అందుబాటులో ఉన్నాయి. టాటా మోటర్స్‌ కొన్ని వారాల క్రితం హారియర్‌, సఫారీ ఫేస్‌లిఫ్ట్‌ మోడల్స్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. తాజా మిడ్‌లైఫ్‌ సైకిల్‌ అప్‌డేట్‌తో రెండు ఎస్‌యూవీలు ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌, ఫీచర్లపరంగా ఒక ప్రధాన నవీకరణను పొందాయి. ఫేస్‌ లిఫ్టెడ్‌ వెర్షన్లల్లో కొత్త ఫీచర్లు, డిజైన్‌ పరంగా మెరుగుదల ఉన్నప్పటికీ మెకానికల్‌ అంశాలు మాత్రం అలాగే ఉంటాయి. 

ఈ ఎస్‌యూవీలు 6 స్పీడ్‌ మాన్యువల్‌, టార్క్‌ కన్వెర్టర్‌ యూనిట్‌తో జత చేసిన 2.0 లీటర్‌ క్రియోటిక్‌  డీజిల్‌ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ ఇంజిన్‌ బీఎస్‌ 6 ప్రమాణాలకు అనుగుణంగా 168 బీహెచ్‌పీ, 350 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త సఫారీ రూ.16.19 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌) ప్రారంభ ధరతో విడుదల చేశారు. అయితే కొత్త హారియర్‌ రూ.15.49 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌) ప్రారంభ ధరతో విడుదల చేశారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..