ఓలా ఎస్ 1 ప్రో సోనా పేరుతో కొత్త స్కూటర్ ను పరిచయం చేసింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని దీనిలోని కొన్ని భాగాలకు ఉపయోగించారు. అలాగే ఖాతాదారులకు కోసం ప్రత్యేక కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. దీనిలో విజేతకు ఉచితంగా కొత్త స్కూటర్ ను అందజేస్తారు. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ ఇటీవల సోషల్ మీడియా ఎక్స్ లో కొత్త స్కూటర్ టీజర్ ను విడుదల చేశారు. ఈ స్కూటర్ సరికొత్త లుక్ తో ఎంతో ఆకట్టుకుంటోంది. పెర్ల్ వైట్, గోల్డ్ కలర్స్ తో డ్యూయల్ టోన్ థీమ్ తో స్పెషల్ గా కనిపిస్తోంది. వెనుక ఫుట్ పెగ్ లు, సైడ్ స్టాండ్లు, గ్రాబ్ రైల్, బ్రేక్ లివర్లు, ఓఆర్వీఎం లపై బంగారు పూతలను వేశారు. ఈ స్కూటర్ ను డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు. ఈ తర్వాత నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. క్రిస్మస్ సందర్భంగా ఓలా ఎస్1 ప్రో సోనా స్కూటర్ ను ఘనంగా విడుదల చేయనున్నారు. అదే రోజు ఈ కంపెనీ తన సర్వీస్ నెట్ వర్క్ ను దేశంలోని 400 అవుట్ లెట్లకు విస్తరించనుంది.
ఓలా విడుదల చేయనున్న కొత్త స్కూటర్ లో అనేక ప్రత్యేతకలు ఉన్నాయి. హ్యాండిల్ బార్ కౌల్ పైభాగం, ఓఆర్ వీఎంలు, ఫ్రంట్ ఫెండర్, సైడ్ బాడీ ప్యానెల్ లోని దిగువ విభాగాలు గోల్డ్ కలర్ లో ఆకట్టుకుంటున్నాయి. వెనుక స్వింగ్ ఆర్మ్, ముందు ఉండే టెలిస్కోపిక్ ఫోర్కుల కింద భాగాలు కూడా అదే రంగులో ఉన్నాయి. ముందు, వెనుక అల్లాయ్ వీల్స్ ను కూడా గోల్డ్ కలర్ తో తీర్చిదిద్దారు. దీనిలో ప్రత్యేక మైన ఫీచర్లతో మూవ్ ఓఎస్ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేశారు.
కొత్త స్కూటర్ విడుదల సందర్భంగా ఓలా కంపెనీ ప్రత్యేకమైన ఆఫర్ ను తీసుకువచ్చింది. దానికి ఓలా సోనా కాంటెస్ట్ అనే పేరు పెట్టింది. దీనిలో గెలిచిన వారు స్కూటర్ ను ఉచితంగా పొందవచ్చు. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిలో పాల్గొనే వారు ఓలా ఎస్ 1 ప్రో తో రీల్ చేసి పోస్ట్ చేయాలి. లేకపోతే ఓలా ఎలక్ట్రిక్ స్టోర్ బయట ఒక ఫొటో లేదా సెల్ఫీ తీసుకోవాలి. దాన్ని #ఓలాసోనా కాంటెస్ట్ అనే హ్యాష్ ట్యాగ్ తో @ఓలా ఎలక్ట్రిక్ ను ట్యాగ్ చేయాలి. ఇలా చేసిన వారందరూ ఈ కాంటెస్ట్ లో పాల్గొన్నట్టు నిర్ధారిస్తారు. ఓలా కంపెనీ డిసెంబర్ 25న వీరిలో ఒక విజేతను ప్రకటిస్తుంది. వారికి ఉచితంగా సోనా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ ను అందిస్తుంది. సోనా కాంటెస్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు సమీపంలోని ఓలా షోరూమ్ ను కస్టమర్లు సందర్శించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి