Four Days Work: నాలుగురోజులు పనిచేస్తే చాలు.. మిగిలిన మూడురోజులు.. ఆ కంపెనీ ఆఫర్!

|

Sep 28, 2021 | 9:15 PM

వారానికి ఐదురోజుల పని విధానం ప్రస్తుతం ఐటీ సెక్టార్ తో పాటు కొంత వరకూ ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా నడుస్తోంది.

Four Days Work: నాలుగురోజులు పనిచేస్తే చాలు.. మిగిలిన మూడురోజులు.. ఆ కంపెనీ ఆఫర్!
Four Days Work
Follow us on

Four Days Work: వారానికి ఐదురోజుల పని విధానం ప్రస్తుతం ఐటీ సెక్టార్ తో పాటు కొంత వరకూ ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా నడుస్తోంది. వారానికి ఆరురోజుల పని చేస్తున్న మిగిలిన రంగాల వారు ఐదురోజుల పని విధానంలో ఉన్నవారిని చూసి తమ పరిస్థితికి బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక కంపెనీ వారానికి నాలుగురోజుల పని విధానం ప్రవేశపెట్టింది. ఆ కంపెనీలో ఉద్యోగులు వారానికి 4 రోజులు పనిచేస్తే చాలు.. మిగిలిన మూడు రోజులు సెలవులు తీసుకోవచ్చు. ఇంతకీ ఆ కంపెనీ ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తోందా. అదే చెప్పబోతున్నాం.

సైబర్ సెక్యూరిటీ కంపెనీ TAC తన ఉద్యోగులను చైతన్యం నింపే ప్రయత్నంలో 4 రోజుల పని వారానికి మారాలని నిర్ణయించింది. ఒక ప్రకటనలో, TAC సెక్యూరిటీ వారానికి నాలుగురోజుల పని విధానాన్ని ట్రయల్ విధానంగా ప్రవేశ పెట్టినట్టు తెలిపింది. దీని వలన తమ ఉద్యోగులు మరింత ఉత్సాహంగా సంతోషంగా పని చేస్తే దీనిని శాశ్వతం చేస్తామని ప్రకటించింది.

మా ఉద్యోగులను ఆరోగ్యంగా ఉంచడం.. వారి శ్రేయస్సును మొదటి స్థానంలో ఉంచడం కోసం చేస్తున్న ప్రయత్నం. మా కంపెనీలోని వివిధ స్థాయిలలో టీంలలో పని చేస్తున్న యువ బృందం తమ పని-జీవిత సమతుల్యతను సులభతరం చేయడానికి మేము ఎటువంటి ప్రయోగాలు చేయవచ్చు. మా టీం లీడర్లు మిగిలిన జట్లకు ఉదాహరణగా నిలవాలని మేకు కోరుకుంటున్నాము. అందుకనే.. ఈ నాలుగురోజుల పనివిధానానికి మారుతున్నాం అని TAC సెక్యూరిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ & ఫౌండర్ త్రిష్నీత్ అరోరా అన్నారు.

అలా ఎలా?

నిర్ణీత సమయంలో గరిష్ట ఉత్పాదకతను నిర్ధారించడానికి కంపెనీ పూర్తిగా ఆటోమేటెడ్ ప్రక్రియను ఏర్పాటు చేసింది. ఇది పని వేళల్లో ఉద్యోగులు ఒకరితో ఒకరు కలిసి సమయాన్ని వృధా చేయకుండా చేస్తుంది. పని సమయంలో పూర్తిగా తమ ఉద్యోగులు పని మీదనే దృష్టి సారించేలా ఈ ఏర్పాటు ఉంటుంది. దానికి అనుగుణంగా పని విధానంలో టార్గెట్లతో కూడిన పధ్ధతి అనుసరిస్తారు. నాలుగురోజుల పని విధానంలో రోజుకు 8 గంటలకు బదులుగా 10 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది.

ఈ ప్రకటన తర్వాత 80% సిబ్బంది సంతోషించారు

జట్టులో మొత్తం 80% మంది తమ వ్యక్తిగత కట్టుబాట్లు, వృద్ధిపై దృష్టి పెట్టడానికి సుదీర్ఘ వారాంతాన్ని పొందే అవకాశం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారానికి నాలుగురోజుల పాటు ఎక్కువ సమయం పని చేయడానికి వారు సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ అంతర్గత సర్వేలో తేలింది.

కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో నాలుగు రోజుల పని లేదు..

ఈ సంవత్సరం ప్రారంభంలో, కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్, లోక్ సభలో ఇచ్చిన రతపూర్వక సమాధానంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం వారానికి నాలుగు రోజులు లేదా వారానికి 40 పని గంటలు వ్యవస్థను ప్రవేశపెట్టే ఆలోచన కేంద్రం వద్ద లేదని పేర్కొన్నారు.

“కేంద్ర ప్రభుత్వ పరిపాలనా కార్యాలయాలలో పని రోజులు/ సెలవు/ పని గంటలు సంబంధిత కేంద్ర పే కమిషన్‌లచే సిఫార్సు చేయబడుతుందని ఆయన వెల్లడించారు. నాల్గవ వేతన సంఘం సిఫార్సు ఆధారంగా, భారత ప్రభుత్వ పౌర పరిపాలనా కార్యాలయాలలో వారానికి ఐదు రోజులు, రోజుకు ఎనిమిదిన్నర గంటలు పని చేయడం ప్రారంభించడం జరిగింది.” అని ఆయన చెప్పారు.

Also Read: Viral News: ‘ఎనర్జీ డ్రింక్స్’ తాగిన కొద్ది గంటల్లోనే స్పృహ తప్పింది.. తీరా స్కాన్ చేసి చూడగా గట్టి షాక్!

Punjab Politics: ఢిల్లీకి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. బీజేపీతో జట్టు కట్టడానికేనా?