AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Redmi: రెడ్‌మి నుంచి రెండు బడ్జెట్‌ ఫోన్స్‌.. ప్రారంభ ధర రూ. 6999 మాత్రమే.. అదిరే ఫీచర్లు..

Redmi: రెడ్‌మి కంపెనీ ఇండియాలో రెడ్‌మి 9 ఐ స్పోర్ట్, రెడ్‌మి 9 ఎ స్పోర్ట్ అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. కంపెనీ ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను అధికారిక వెబ్‌సైట్‌

Redmi: రెడ్‌మి నుంచి రెండు బడ్జెట్‌ ఫోన్స్‌.. ప్రారంభ ధర రూ. 6999 మాత్రమే.. అదిరే ఫీచర్లు..
Redmi
uppula Raju
|

Updated on: Sep 28, 2021 | 8:36 PM

Share

Redmi: రెడ్‌మి కంపెనీ ఇండియాలో రెడ్‌మి 9 ఐ స్పోర్ట్, రెడ్‌మి 9 ఎ స్పోర్ట్ అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. కంపెనీ ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను అధికారిక వెబ్‌సైట్‌ జాబితాలో ఉంచింది. ఇవి రెండు కూడా బడ్జెట్‌ స్మార్ట్ ఫోన్స్‌. Redmi 9A స్పోర్ట్ ప్రారంభ ధర కేవలం రూ. 6,999 మాత్రమే.

Redmi 9i స్పోర్ట్ ప్రారంభ ధర రూ .8,799 మాత్రమే. ఈ మొబైల్స్‌లో 4 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అయితే మరో ఫోన్‌లో 4 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. దీని ధర రూ. 9299గా నిర్ణయించారు. ఇది Mi.Dom లో జాబితా చేశారు. ఈ ఫోన్ కార్బన్ బ్లాక్, మెటాలిక్ పర్పుల్, కోరల్ గ్రీన్ కలర్‌లో వస్తుంది.

అదే సమయంలో మీరు Redmi 9A స్పోర్ట్‌ను రూ. 6,999 కి కొనుగోలు చేయవచ్చు. ఇది 2 GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుంది. ఇతర వేరియంట్ ధర రూ.7999. ఈ వేరియంట్ 3 GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Redmi’s Mi.Com లో కూడా జాబితా చేశారు. ఈ ఫోన్ కార్బన్ బ్లాక్, మెటాలిక్ పర్పుల్, కోరల్ గ్రీన్ కలర్‌లో వస్తుంది. రెండు స్పోర్ట్స్ మోడళ్లపై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.

Redmi 9A స్పోర్ట్ స్పెసిఫికేషన్స్ Redmi 9A స్పోర్ట్ 6.53-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది వాటర్‌ డ్రాప్ నాచ్ శైలిలో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జి 25 ప్రాసెసర్ అందించారు. అలాగే ఇది గరిష్టంగా 3 GB RAM కలిగి ఉంటుంది. ఈ ఫోన్ MIUI 12 ఆధారిత Android 10 పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 3.5 ఎంఎం ఆడియో జాక్, ఛార్జింగ్ కోసం మైక్రో యుఎస్‌బి పోర్ట్ ఉంటాయి.

రెడ్‌మి 9 ఐ స్పోర్ట్ స్పెసిఫికేషన్‌లు Redmi 9i స్పోర్ట్ 6.53-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో మీడియాటెక్ హీలియో జి 25 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ 4 GB RAM, 128 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉంటుంది. ఫోటోలు, వీడియోల కోసం కంపెనీ బ్యాక్ ప్యానెల్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఇచ్చింది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. పవర్ బ్యాకప్ కోసం 5000 mAh బ్యాటరీ అందించారు.

Jio Recharge Offer: జియో రీఛార్జి పై అదిరిపోయే క్యాష్ బ్యాక్ ఆఫర్.. పొందాలంటే ఏం చేయాలంటే..

AP Covid 19: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. రాష్ట్రంలో కొత్త నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే..?

12 పరుగులకే 6 వికెట్లు పడిపోయాయి..! 8వ స్థానంలో వచ్చిన బ్యాట్స్‌మెన్ జట్టు పరువు కాపాడాడు..

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే