Swiggy: వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన స్విగ్గీ.. ఇకపై అన్‌లిమిటెడ్‌ ఫ్రీ డెలవరీలు.. అయితే..

Swiggy: ప్రస్తుతం ఫుడ్‌ డెలివరీ యాప్‌లకు ఫుల్‌ డిమాండ్‌ పెరుగుతోంది. పక్కనే రెస్టారెంట్‌ ఉన్నా యాప్‌లో బుక్‌ చేసుకుంటోన్న రోజులివీ. ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ పెరగడం, రకరకాల ఆఫర్లను ప్రకటించడంతో...

Swiggy: వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన స్విగ్గీ.. ఇకపై అన్‌లిమిటెడ్‌ ఫ్రీ డెలవరీలు.. అయితే..
Swiggy One Option

Updated on: Nov 22, 2021 | 6:19 PM

Swiggy: ప్రస్తుతం ఫుడ్‌ డెలివరీ యాప్‌లకు ఫుల్‌ డిమాండ్‌ పెరుగుతోంది. పక్కనే రెస్టారెంట్‌ ఉన్నా యాప్‌లో బుక్‌ చేసుకుంటోన్న రోజులివీ. ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ పెరగడం, రకరకాల ఆఫర్లను ప్రకటించడంతో వినియోగదారులు కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నారు. దీంతో సహజంగానే సంస్థల మధ్య పెరుగుతోంది. ఈ కారణంగానే కంపెనీలు పోటీ పడీ మరీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ కస్టమర్స్‌ కోసం ఓ స్పెషల్‌ ఆఫర్‌ను తీసుకొచ్చింది. సాధారణంగా ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుంటే సెపరేట్‌గా డెలివరీ చార్జ్‌లు కూడా ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే స్విగ్గీ తీసుకొచ్చిన ఆఫర్‌తో అపరిమితంగా ఉచిత డెలివరీలు పొందే అవకాశం కల్పించనున్నారు.

దీని కోసం స్విగ్గీ ‘స్విగ్గీ వన్‌’ అనే అప్‌గ్రేడ్‌ మెంబర్‌షిప్‌ ప్రోగ్రాంను తీసుకొచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా 70 వేల కంటే ఎక్కువగా రెస్టారెంట్‌ల నుంచి అపరిమిత ఉచిత డెలివరీలను కస్టమర్లు పొందవచ్చు. ఈ మెంబర్‌షిప్‌ పొందాలంటే కస్టమర్లు మూడు నెలలకు గాను రూ. 299 లేదా ఏడాదికి రూ. 899 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సేవలను ప్రస్తుతం లక్నో, పూణే, త్రివేండ్రం, విజయవాడలో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే దేశంలోని 500కు పైగా నగరాల్లో ఈ మెంబర్‌ షిప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే స్విగ్గీ సూపర్‌ మెంబర్స్‌గా ఉన్నవారు ‘స్విగ్గీ వన్‌’ మెంబర్‌షిప్‌కు ఏలాంటి ఖర్చులేకుండా ఉచితంగా అప్‌గ్రేడ్‌ అవుతారని కంపెనీ పేర్కొంది. ఇదిలా ఉంటే ‘స్విగ్గీ సూపర్‌’ ప్లాన్‌తో కేవలం పరిమిత సంఖ్యలోనే ఉచిత డెలివరీలను పొందే అవకాశం ఉండేది.. కానీ దీనిని ప్రస్తుతం అన్‌లిమిటెడ్‌గా మార్చారు.

Also Read: Kartikeya Wedding: ప్రేయసి లోహితతో ఘనంగా జరిగిన నటుడు కార్తికేయ వివాహం వేడుక.. హాజరైన మెగాస్టార్ చిరు..

AP 3 Capitals: ఏపీ మూడు రాజదానుల బిల్లు ఉపసంహరణ నిర్ణయంపై ఎవరెవరు ఏమన్నారంటే..?

ఇల్లు కొనడానికి బంపర్‌ ఆఫర్.. ఈ-వేలంలో పాల్గొనండి.. తక్కువ ధరకే కొనుగోలు చేయండి..