PM Kisan: రైతులకు సూచన.. తప్పులు సరిదిద్దుకోండి.. రూ.6 వేలు పొందండి..

|

Oct 23, 2021 | 6:51 PM

PM Kisan: ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథకాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2018లో ఎంతో ప్రతిష్టాత్మకంగా

PM Kisan: రైతులకు సూచన.. తప్పులు సరిదిద్దుకోండి.. రూ.6 వేలు పొందండి..
Pm Kisan
Follow us on

PM Kisan: ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథకాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2018లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం ప్రతి ఏటా రూ.6వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆరు వేల రూపాయలను ఒకేసారి ఇవ్వకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అర్హత గల ప్రతి రైతు ఖాతాలో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున జమ చేస్తుంది. అయితే కొంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. ఎందుకంటే వీరి దరఖాస్తు విధానంలో తప్పులు ఉండటం వల్ల డబ్బులు రావడం లేదు. అయితే వీరి పేరుపై డబ్బులు మంజూరై ఉన్నాయి కానీ వీరు తప్పులు సరిదిద్దుకుంటేనే ఆ డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి.

రైతులు చేస్తున్న త‌ప్పులు
1. ఖాతా యాక్టివేట్‌గా ఉండ‌టం లేదు. హోల్డ్‌లో ఉంటుంది.
2 . వీరు ఇచ్చిన అకౌంట్ బ్యాంకులో ఉండ‌టం లేదు. దీని అర్థం ఖాతా నంబర్ త‌ప్పుగా ఉంటుంది.
3. పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (PFMS) ద్వారా రైతు రికార్డు ఆమోదించలేదు.
4. బ్యాంక్ తిరస్కరించిన ఖాతా అంటే ఖాతా మూసివేసార‌ని అర్థం.
5. PFMS/ ద్వారా రైతు భూ రికార్డును తిరస్కర‌న‌కు గురైంది.
6. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆధార్ లింక్ జరగలేదు.
7. రాష్ట్ర ప్రభుత్వం నుంచి క‌ర‌క్ష‌న్ పెండింగ్‌లో ఉంది.

ఇలా సరిదిద్దుకోండి..
1. అధికారిక సైట్ www.pmkisan.gov.in సందర్శించండి.
2. వెబ్‌సైట్ హోమ్‌పేజీలో లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయండి
3. మీ రాష్ట్రం, జిల్లా/ఉప ఎంచుకోండి. జిల్లా, బ్లాక్ గ్రామ వివరాలు సరిగ్గా ఉన్నాయా చూడండి
4. స్క్రీన్‌పై కనిపించే లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయండి
5. మీ పేరును తనిఖీ చేసి, నిర్ధారించండి
6. pmksny హోమ్‌పేజీకి తిరిగి వెళ్లండి.
7. మీ ఆధార్ కార్డ్ వివరాలు, మొబైల్ నంబర్ లేదా మీ ఖాతా నంబర్ ఎంటర్ చేయండి.
8. తర్వాత మీ వాయిదా చెల్లింపు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
9. దీనిని ప్రింట్‌ అవుట్ తీసుకుని మీ వద్ద ఉంచుకోండి.

Akhila Priya: భూమా అఖిల ప్రియ పార్టీ మారబోతున్నారా.. సోషల్ మీడియాలో విస్తృత చర్చ.. క్లారిటీ ఇచ్చిన అఖిల..

Viral Video: వావ్‌ వాటే క్రియేటివిటీ.. తాపీ పనిని ఇంత ఇన్నోవేటివ్‌గా కూడా చేయొచ్చా.. వైరల్‌ వీడియో..

Ind Vs Pak: పాకిస్తాన్‌ క్రికెటర్లకు సూపర్‌ ఆఫర్.. ఇండియాని ఓడిస్తే బ్లాంక్ చెక్ రెడీ..