CNG Vehicles: సీఎన్‌జీ వాహనాలతోనే ఎక్కువ కాలుష్యం! అధ్యయనంలో షాకింగ్ విషయాలు..
సీఎన్జీ వాహన వినియోగదారులకు షాక్ ఇచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ వాహనాల నుంచి అధికంగా కాలుష్య కారకాలు విడుదలవుతున్నట్టు నివేదిక విడుదలైంది. ఢిల్లీ, గురుగ్రావ్ లలో అధికారులు కొన్ని వాహనాలకు పరీక్షలు నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకూ సీఎన్ జీ వాహనాలతో పర్యావరణానికి మేలు జరుగుతుందని భావిస్తున్న వారికి ఇది నిజంగా షాకింగ్ న్యూసే.
కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ )తో నడిచే వాహనాలకు ఇటీవల డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఈ విభాగంలోని కార్లను బాగా కొనుగోలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలకన్నా వీటి వినియోగం పెరిగింది. ఈ వాహనాలకు ఉన్న డిమాండ్ ఆధారంగా వివిధ కంపెనీలు సీఎన్‌జీ విభాగంలో వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే సీఎన్‌జీ వాహనాలకు ఆదరణ పెరగడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. పెట్రోలు, డీజిల్‌తో పోల్చితే సీఎన్జీ ధర తక్కువ. కారు నిర్వహణ వ్యయం కూడా అదుపులో ఉంటుంది. ముఖ్యంగా సీఎన్ జీ వాహనాల నుంచి కాలుష్య కారకాలు తక్కువ స్థాయిలో వెలువడతాయి. తద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. దీంతో ఎక్కువ మంది సీఎన్జీ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. కాగా.. సీఎన్జీ వాహన వినియోగదారులకు షాక్ ఇచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ వాహనాల నుంచి అధికంగా కాలుష్య కారకాలు విడుదలవుతున్నట్టు నివేదిక విడుదలైంది. ఢిల్లీ, గురుగ్రావ్ లలో అధికారులు కొన్ని వాహనాలకు పరీక్షలు నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకూ సీఎన్ జీ వాహనాలతో పర్యావరణానికి మేలు జరుగుతుందని భావిస్తున్న వారికి ఇది నిజంగా షాకింగ్ న్యూసే.
ఎక్కువ కాలుష్యం..
సీఎన్జీ వాహనాల నుంచి మనం అనుకున్న దానికంటే ఎక్కువ కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయని అధికారులు నిర్థారించారు. ల్యాబ్ లో చేసిన పరీక్షల్లో వెల్లడైన శాతం కంటే రోడ్లపై తిరుగుతున్నప్పుడు ఎక్కువ విడుదలవుతున్నట్టు తెలిపారు. ది రియల్ అర్బన్ ఎమిషన్స్ (టీఆర్ యూవీ) ఇనిషియేటివ్ లో భాగంగా ఈ అధ్యయనం చేశారు. ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాలలో అక్కడి అధికారుల సహకారంతో రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించి వాహనాల నుంచి విడుదలవుతున్న వాస్తవ ఉద్గారాల స్థాయిని కొలిచారు. ఈ సందర్భంగా సీఎన్ జీ వాహనాల నుంచి అనుకున్న దానికంటే ఎక్కువగా కాలుష్య కారకాలు విడుదలవుతున్న తేలింది.
అధికారుల అధ్యయనం..
ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్స్ పోర్టేషన్ (ఐసీసీటీ) చేసిన ఈ అధ్యయనం నుంచి మరికొన్ని విషయాలపై స్పష్టత వచ్చింది. నైట్రోజన్ ఆక్సైడ్ (ఎన్ వోఎక్స్) ఉధ్గారాల స్థాయి బీఎస్ 4 కార్ల కంటే బీఎస్ 6 కార్ల నుంచి 81 శాతం తక్కువ వెలువడుతున్నట్టు తెలిసింది. అలాగే బీఎస్ 4 బస్సులతో పోల్చితే బీఎస్ 6 బస్సుల నుంచి 95 శాతం తక్కువగా వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని ఇంత వరకూ భావించిన సీఎన్ జీ వాహనాల నుంచి అధిక స్థాయిలో నైట్రోజన్ ఆక్సైడ్ విడుదల అవుతున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. దీంతో సీఎన్ జీ వాహనాలపై ఇంత వరకూ ఉన్న అభిప్రాయం మారే అవకాశం కనిపిస్తోంది. క్లాస్ 2 లైట్ గూడ్స్ వాహనాలు ల్యాబ్ పరీక్షల సమయంలో విడుదల చేసిన దానికంటే 14.2 రెట్లు ఎక్కువ వదులుతున్నట్టు నిర్ధారణ అయ్యింది. అలాగే టాక్సీల నుంచి నాలుగు రెట్లు ఎక్కువ విడుదలవుతున్నట్టు గుర్తించారు.
తప్పని అవస్థలు..
చదువు, వ్యాపారం, ఉద్యోగాల కోసం చాలామంది నగరాల బాట పడుతున్నారు. అక్కడ వారికి అన్ని సౌకర్యాలతో జీవనం సాఫీగా నడిచినా.. ఒక్క కాలుష్యం విషయంలో మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరాలు ఎప్పుడూ అధిక జనాభాతో కిక్కిరిసి ఉంటాయి. పెరుగుతున్నజనాభా అవసరాలకు అనుగుణంగా చెట్లను నరికివేసి అపార్టుమెంట్లు, భవనాలు కడుతున్నారు. పచ్చదనం పూర్తిగా కనుమరుగవుతోంది. దానికి తోడు అధిక సంఖ్యలో కార్లు, ఇతర వాహనాలు రోడ్లపై నిత్యం సంచరిస్తూ ఉంటాయి. వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పెట్రోల్, డీజీల్ వాహనాల నుంచి కాలుష్య సమస్య ఉండడంతో వాటికి ప్రత్యామ్నాయంగా సీఎన్ జీ వాహనాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే వీటి నుంచి అదే సమస్య ఉత్పన్నమవుతున్నట్టు తేలింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..