STORY BEHIND NAME OF AIR INDIA: ఎయిర్ ఇండియాకు ఆ పేరు ఊరికే రాలేదు బాస్. అసలు ఆ పేరు ఎంపిక వెనుకే చాలా పెద్ద కథ ఉంది. ప్రపంచానికి విమానయానం అంటే ఎంటో తెలియని రోజుల్లో.. దానికి ఓ పేరు పెట్టడానికి టాటా యాజమాన్యం చేసిన కసరత్తేంటో మనమూ తెలుసుకుందాం రండి.. సుమారు 75 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఎయిర్ ఇండియాకు ఆ పేరు పెట్టడం వెనుక జరిగిన టాటా గ్రూప్(TATA GROUP) బయటపెట్టింది. పేరు నిర్ణయం వెనుక జరిగిన ఆసక్తికర ప్రక్రియను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అందుకు అప్పటి టాటా సంస్థ ఉద్యోగులు యాజమాన్యానికి ఎలా సహకరించారో సంస్థ వివరించింది.
టాటా సన్స్ లో భాగంగా కొనసాగుతున్న విమానయాన విభాగాన్ని 1946లో పూర్తి స్థాయి ప్రత్యేక కంపెనీగా రూపకల్పన చేస్తున్న సమయం. అందుకోసం కంపెనీకి ఒక పేరు నిర్ణయించడంపై తర్జనభర్జన జరుగుతున్న సమయం. భారత దేశ మెుట్టమెుదటి విమానయాన సంస్థ కావడంతో దానికి.. ఎయిర్ ఇండియా, పాన్ ఇండియన్ ఎయిర్ లైన్స్, ట్రాన్స్ ఇండియన్ ఎయిర్ లైన్స్, ఇండియన్ ఎయిర్ లైన్స్ అంటూ నాలుగు పేర్లను సంస్థ ప్రతిపాదించింది. కానీ.. అంతిమంగా వాటిలో నుంచి ఒక పేరును ఫైనల్ చేయాలి.. దానికోసం సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులతో ఓ పోల్ నిర్వహించింది. తద్వారా ఎక్కువమంది ప్రతిపాధించిన పేరును విమానయాన సంస్థకు పెట్టాలని భావించింది.
1946- టాటా నెలవారీ బులిటెన్ లో పేరు నిర్ణయానికి వెనుక జరిగిన కసరత్తును ఇలా చెప్పుకొచ్చింది టాటా గ్రూప్.. ”ఈ సంవత్సరం టాటా గ్రూప్ ముందుకు ఒక సమస్య వచ్చింది. అదేంటంటే టాటా సన్స్ కింద ఉన్న విమానయానాన్ని పూర్తి స్థాయి ప్రత్యేక కంపెనీగా చేయాలని సంస్థ నిర్ణయించింది. కానీ.. నూతనంగా ఏర్పాటు చేయనున్న టాటా ఎయిర్ లైన్స్ కు ఏం పేరు పెట్టాలి? అన్నదే అసలు సమస్య.”
అందుకోసం.. Indian Airlines, Pan-Indian Airlines, Trans-Indian Airlines and Air-India పేర్లలో ఒకదానిని ఎంపిక చేయాలి. దీనికోసం ఒక సర్వే నిర్వహించి దానిలో ఎక్కువ మంది ప్రతిపాధించిన లేక ఆమోదించిన పేరును పెట్టాలని నిర్ణయించింది. బాంబే హౌస్ లో టాటా సంస్థ ఉద్యోగులకు పోల్ నిర్వహించింది. పోలింగ్ మెుదటి రౌండ్ లో ఎయిర్ ఇండియాకు- 64, ఇండియన్ ఎయిర్ లైన్స్ కు- 51, ట్రాన్స్ ఇండియన్ ఎయిర్ లైన్స్ కు -28, పాన్ ఇండియన్ ఎయిర్ లైన్స్ కు -19 ఓట్లు పడ్డాయి. అంతిమంగా నిర్వహించిన కౌంటింగ్ లో ఎయిర్ ఇండియా పేరుకు అత్యధికంగా -72 ఓట్లు రావడంతో ఆ పేరునే కొత్తగా ఏర్పాటు చేస్తున్న విమానయాన కంపెనీకి పెట్టాలని టాటా యాజమాన్యం నిర్ణయించింది.
(2/2): But who made the final decision? Read this excerpt from the Tata Monthly Bulletin of 1946 to know. #AirIndiaOnBoard #WingsOfChange #ThisIsTata pic.twitter.com/E7jkJ1yxQx
— Tata Group (@TataCompanies) February 6, 2022
ఇదంతా ఒక ఎత్తైతే సుమారు 75 ఏళ్ల తరువాత ఎయిర్ ఇండియాను తిరిగి తన సొంతం చేసున్న టాటాలు తాము ప్రయాణికులు ఇచ్చే గౌరవాన్ని, ప్రాముఖ్యతను మళ్లీ నిరూపించకున్నారు. ఎయిర్ ఇండియాను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా స్వయంగా ఎయిర్ ఇండియాలో ప్రయాణిస్తున్న వారందరినీ ఆహ్వానిస్తూ ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చారు. దీంతో స్వయంగా రతన్ టాటా మాటలు విన్న ప్రయాణికులు ఫిదా అయ్యారు.
#FlyAI: A warm welcome extended by Mr Ratan Tata, Chairman Emeritus, Tata Sons, Chairman Tata Trusts, to our passengers onboard Air India flights. pic.twitter.com/MkVXEyrj3J
— Air India (@airindiain) February 2, 2022
Also read…
Stock Market: బేరుమంటున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1200, నిఫ్టి 380 పాయింట్లకు పైగా లాస్..