కేంద్రానికి ఆర్బీఐ నగదు బదిలీ.. దూసుకెళ్లిన బుల్

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా లాభాల్లో ముగిశాయి. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో తెచ్చిన సంస్కరణల నేపథ్యంలో సోమవారం ఉరకేలేసిన బుల్.. మంగళవారం కూడా అదే జోరుతో పరుగెత్తింది. దీనికి తోడు ఆర్బీఐ కేంద్రానికి రూ.1.76లక్షల కోట్ల నగదు బదిలీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా కలిసొచ్చింది. దీంతో దాదాపు అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 147 పాయింట్ల లాభంతో 37,641 వద్ద ముగియగా.. నిఫ్టీ 47 పాయింట్లు లాభపడి […]

కేంద్రానికి ఆర్బీఐ నగదు బదిలీ.. దూసుకెళ్లిన బుల్

Edited By:

Updated on: Aug 27, 2019 | 4:19 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా లాభాల్లో ముగిశాయి. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో తెచ్చిన సంస్కరణల నేపథ్యంలో సోమవారం ఉరకేలేసిన బుల్.. మంగళవారం కూడా అదే జోరుతో పరుగెత్తింది. దీనికి తోడు ఆర్బీఐ కేంద్రానికి రూ.1.76లక్షల కోట్ల నగదు బదిలీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా కలిసొచ్చింది. దీంతో దాదాపు అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 147 పాయింట్ల లాభంతో 37,641 వద్ద ముగియగా.. నిఫ్టీ 47 పాయింట్లు లాభపడి 11,105 వద్ద స్థిరపడింది. ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.61గా కొనసాగుతోంది.