stock market: ఎల్లుండే యూనియన్ బడ్జెట్.. స్టాక్ మార్కెట్లు పెరుగుతాయా.. తగ్గుతాయా..

|

Jan 30, 2022 | 9:30 PM

వచ్చే వారం స్టాక్ ​మార్కెట్లను పలు కీలక అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అందరి చూపు ఎల్లుండి కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్​పైనే ఉంది...

stock market: ఎల్లుండే యూనియన్ బడ్జెట్.. స్టాక్ మార్కెట్లు పెరుగుతాయా.. తగ్గుతాయా..
Stock Markets
Follow us on

వచ్చే వారం స్టాక్ ​మార్కెట్లను పలు కీలక అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అందరి చూపు ఎల్లుండి కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్​పైనే ఉంది. దీంతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు, సంస్థల త్రైమాసిక లాభాల ప్రకటన, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం మార్కెట్లను నడిపించనున్నాయని నిపుణులు చెబుతున్నారు. “మార్కెట్లతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ వారం ఎంతో కీలమైంది. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా.. అభివృద్ధి అజెండాతో సానుకూల నిర్ణయాలు ఉంటాయని పెట్టుబడిదారులు భావిస్తున్నారు.

బడ్జెట్​ ప్రవేశపెట్టే వారంలో సూచీల్లో ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని, అంతర్జాతీయ మదుపరుల అమ్మకాల నేపథ్యంలో బడ్జెట్​.. దేశీయ మార్కెట్లను నడిపించనుంది. పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్ కాకుండా.. అంతర్జాతీయంగా డాలర్​ విలువ, చముర ధరల పెరుగుదల వంటివి దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని మీనా అంచనా వేశారు.

Read Also… Work From Home: ఆఫీస్‌కు వస్తారా.. వర్క్ ఫ్రమ్ హోం చేస్తారా.. సర్వే ఏం చెబుతుంది..