Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 488, నిఫ్టీ 114 పాయింట్ల హైక్.. భారీగా పెరిగిన టైటాన్ షేరు..

|

Oct 07, 2021 | 4:13 PM

బుధవారం నష్టంపోయిన స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలను గడించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 488 పాయింట్లు పెరిగి 59,678 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ144 పాయింట్ల లాభంతో 17,790 వద్దకు చేరింది...

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 488, నిఫ్టీ 114 పాయింట్ల హైక్.. భారీగా పెరిగిన టైటాన్ షేరు..
Stock Market Sensex
Follow us on

బుధవారం నష్టంపోయిన స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలను గడించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 488 పాయింట్లు పెరిగి 59,678 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ144 పాయింట్ల లాభంతో 17,790 వద్దకు చేరింది. ఆరంభం నుంచి సూచీలు దూకుడు ప్రదర్శించాయి. సెషన్​ ఆరంభంలో అన్ని రంగాలు సానుకూలంగా స్పందించాయి. మిడ్​సెషన్​ తర్వాత బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

నిన్న 59,190 వద్ద ముగిసిన సెన్సెక్స్ ఇవాళ 59,914 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకి 59,597 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది. నిఫ్టీ 17,857 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకి 17,763 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది. ఈ రోజు టైటాన్ షేర్లు రికార్డు సృష్టించారు. ఒక్క రోజులోనే 19 శాతానికి పైగా పెరిగాయి. దీనితో షేరు విలువ జీవవకాల గరిష్ఠాన్ని తాకింది. మార్కెట్​ క్యాపిటల్​ రూ.2 లక్షల కోట్లు దాటింది. ఈ రోజు మధ్యాహ్నం ట్రేడ్‌లో ఆటో ఇండెక్స్ 4.5% పెరిగింది. ఆర్బీఐ శుక్రవారం ప్రకటించబోయే వడ్డీ, రేపో రేట్ల అంచనాలతో షేర్లు రాణించాయి. స్మాల్, మిడ్ క్యాప్ సూచిలు కూడా రాణించాయి.

ఎం&ఎం, మారుతీ సుజుకీ, ఇండస్​ఇండ్ బ్యాంక్​, ఏషియన్​ పెయింట్స్​, సన్​ ఫార్మా లాభాలను గడించాయి. డాక్టర్​ రెడ్డీస్​, హెచ్‎​డీఎఫ్‎​సీ, బజాజ్ ఫిన్​సర్వ్​, హెచ్‎​యూఎల్, నెస్లే ఇండియా నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లలో.. నిక్కీ (జపాన్​), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్​సెంగ్​ (హాంకాంగ్​) సూచీలు లాభాలను గడించాయి. షాంఘై (చైనా) సూచీకి ఈ రోజు సెలవు.

Read Also.. Anjeer for Weight Loss: బరువు వేగంగా తగ్గాలని అనుకుంటున్నారా? అయితే.. అంజీర్‌తో ప్రయత్నించండి..