Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 669, నిఫ్టీ 201 పాయింట్ల డౌన్..

|

Feb 07, 2022 | 12:00 PM

భారతీయ స్టాక్ మార్కెట్ల్(stock market) భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్​ 669 పాయింట్లకుపైగా నష్టపోయి 57,961 వద్ద కదలాడుతోంది...

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 669, నిఫ్టీ 201 పాయింట్ల డౌన్..
Stock Market
Follow us on

భారతీయ స్టాక్ మార్కెట్ల్(stock market) భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్​ 669 పాయింట్లకుపైగా నష్టపోయి 57,961 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 200 పాయింట్ల పతనంతో 17,323 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయంగా చూస్తే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) పరపతి విధాన కమిటీ (MPC) సమావేశం 8న ప్రారంభమై, 10న నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈవారం దేశీయ సూచీల్లో ఊగిసలాటలు కనిపించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం (Inflation), ద్రవ్యలోటు, పెరుగుతున్న ముడి చమురు ధరలను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకొనే సూచనలు కనిపిస్తున్నాయి.

కొవిడ్‌ మూడో దశ వ్యాప్తి కొనసాగుతున్నందున, ప్రస్తుత సమీక్షలో ఆర్‌బీఐ కీలక రేట్లను యథాతథంగా కొనసాగించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే సర్దుబాటు నుంచి తటస్థం వైపు వైఖరి మారొచ్చని పేర్కొంటున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తగా వడ్డీరేట్ల పెంపు ఎఫ్‌ఐఐ (FII)ల అమ్మకాలను మరింత ప్రభావితం చేయొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. 30 షేర్ల ఇండెక్స్‌లో టాటాస్టీల్, పవర్​గ్రిడ్, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్​సిమెంట్, ​ఎస్బీఐఎన్, రిలయన్స్​ టెక్​మహీంద్రా మినహా మిగిలిన షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Read Also.. Petrol Diesel Price: స్థిరంగా చమురు ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇలా..