AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card UPI: అకౌంట్‌లో మనీ అయిపోయిందా? క్రెడిట్ కార్డుతో యూపీఐ పేమెంట్ చేయండి! ప్రాసెస్ ఎలాగంటే..

ఏదైనా షాపుకి వెళ్లినప్పుడు సడెన్‌గా అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు అని చూపిస్తే ఇకపై కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే దాన్ని ఉపయోగించి కూడా యూపీఐ పేమెంట్ చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ తో యూపీఐ పేమెంట్ చేసే సౌకర్యం ఎప్పుడో వచ్చింది. అయితే చాలామందికి దాన్నెలా ఉపయోగించాలో తెలియదు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Credit Card UPI: అకౌంట్‌లో మనీ అయిపోయిందా? క్రెడిట్ కార్డుతో యూపీఐ పేమెంట్ చేయండి! ప్రాసెస్ ఎలాగంటే..
Credit Card Upi
Nikhil
|

Updated on: Oct 29, 2025 | 12:29 PM

Share

ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో అకౌంట్‌లో డబ్బు అయిపోయినప్పుడు క్రెడిట్ కార్డుతో యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసేయొచ్చు. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి అన్ని యాప్స్ లో క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ పేమెంట్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని యాప్‌లు కేవలం రూపే క్రెడిట్ కార్డుని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంటే మరికొన్ని యాప్స్ వీసా, మాస్టర్ కార్డ్ వంటి క్రెడిట్ కార్డులను కూడా సపోర్ట్ చేస్తున్నాయి.

ప్రాసెస్‌ ఇలా..

క్రెడిట్ కార్డుని యూపీఐ యాప్ తో లింక్ చేయడం కోసం ముందుగా యూపీఐ యాప్ లోకి వెళ్లి అక్కడ పేమెంట్ ఆప్షన్‌లో ‘యాడ్ క్రెడిట్ కార్డ్’ ఎంచుకోవాలి. ఆ తర్వాత కార్డ్ వివరాలు ఎంటర్ చేసి, ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేయాలి. ఆ తర్వాత యూపీఐ పిన్ సెట్ చేసుకుంటే మీ క్రెడిట్ కార్డు యూపీఐ యాప్ తో లింక్ అవుతుంది. ఇకనుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డు ఆప్షన్ కూడ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి పేమెంట్ చేస్తే క్రిడిట్ కార్డు నుంచి పేమెంట్ అవుతుంది. ఇలాంటి పేమెంట్స్ కు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు.

క్రెడ్ యూపీఐ

ఇకపోతే క్రెడ్ యాప్ ద్వారా కూడా యూపీఐ, క్యూఆర్ కోడ్ స్కాన్ పేమెంట్స్ చేయొచ్చు. క్రెడ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని అందులో  మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డులను లింక్ చేసుకోవాలి. ఎప్పుడైనా యూపీఐ పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్ గా క్రెడ్ యాప్ లో క్యూఆర్ స్కానర్ ఓపెన్ చేసి, కింద క్రెడిట్ కార్డు సెలక్ట్ చేసుకుని డైరెక్ట్ గా పేమెంట్ చేయొచ్చు. అన్ని పెద్ద బ్యాంకుల క్రెడిట్ కార్డులు యూపీఐ పేమెంట్స్ ను యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇలా క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయడం ద్వారా కొన్నిసార్లు క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్లు వంటి లాభాలు కూడా పొందొచ్చు. అయితే క్రెడిట్ కార్డు ద్వారా చేసే యూపీఐ పేమెంట్స్ కేవలం మర్చెంట్ చెల్లింపులకు మాత్రమే వర్తిస్తాయి. అంటే షాపులు, రెస్టారెంట్ల వంటివి.  ఇతర వ్యక్తులకు డబ్బు పంపడం లేదా బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం కుదరదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..