ఫ్రాడ్ కేసులో లక్ష్మీ మిట్టల్ సోదరుడు అరెస్ట్

| Edited By:

Jul 24, 2019 | 1:02 PM

భారత్‌కు చెందిన పారిశ్రామిక వేత్త, స్టీల్ మాగ్నేట్ లక్ష్మీ మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్‌‌ను బోస్నియాలో పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం, అధికార దుర్వినియోగం ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు. ప్రమోద్ మిట్టల్‌తో పాటు, కంపెనీ జనరల్ మేనేజర్ పరమేష్ భట్టాచార్య, పర్యవేక్షక బోర్డు సభ్యుడు రజీబ్ డాష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వారు వెల్లడించారు. వీరిని కోర్టుముందు హాజరుపర్చనున్నామని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. అయితే ఈ కేసులో ఆయనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే ప్రమోద్‌కు […]

ఫ్రాడ్ కేసులో లక్ష్మీ మిట్టల్ సోదరుడు అరెస్ట్
Follow us on

భారత్‌కు చెందిన పారిశ్రామిక వేత్త, స్టీల్ మాగ్నేట్ లక్ష్మీ మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్‌‌ను బోస్నియాలో పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం, అధికార దుర్వినియోగం ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు. ప్రమోద్ మిట్టల్‌తో పాటు, కంపెనీ జనరల్ మేనేజర్ పరమేష్ భట్టాచార్య, పర్యవేక్షక బోర్డు సభ్యుడు రజీబ్ డాష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వారు వెల్లడించారు. వీరిని కోర్టుముందు హాజరుపర్చనున్నామని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.

అయితే ఈ కేసులో ఆయనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే ప్రమోద్‌కు 45ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని లాయర్లు చెబుతున్నారు. మరోవైపు ఈ వార్తలపై కంపెనీ ప్రతినిధులు ఇంకా స్పందించలేదు. లుకావాక్ పట్టణంలోని ఈశాన్య ప్రాంతంలో ఓ కుక్కింగ్ ప్లాంట్‌ను ప్రమోద్ నడుపుతున్నారు. 2003 నుంచి ఈ కంపెనీ నడుస్తుండగా.. ఇందులో వెయ్యి మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.