దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కోట్లాది మంది ఖాతాదారులకు చేదువార్త. బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం ఇప్పుడు ఖరీదైనదిగా మారింది. బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్‌ఆర్)ని 25 బేసిస్ పాయింట్లు పెంచింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, కొత్త ఎంసీఎల్‌ఆర్ రేట్లు అక్టోబర్ 15, 2022 నుండి అమలులోకి వచ్చాయి. ఎంసీఎల్‌ఆర్ రేటు పెంపు తర్వాత, రేటు ఒక నెల, మూడు నెలల కాలానికి 7.35 శాతం నుండి 7.60 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఆరు నెలల కాలానికి 7.65 శాతం నుండి 7.90 శాతానికి పెరిగింది. మరోవైపు ఏడాది కాలానికి 7.70 శాతం నుంచి 7.95 శాతానికి పెంచారు. రెండేళ్ల కాలవ్యవధికి రుణ రేటు 7.90 శాతం నుంచి 8.15 శాతానికి పెరిగింది. కాగా, మూడేళ్ల కాలానికి ఎంసీఎల్‌ఆర్‌ను 8 శాతం నుంచి 8.25 శాతానికి పెంచారు.
ఎంసీఎల్‌ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) అనేది బ్యాంకులు కస్టమర్లకు రుణాలు అందించే కనీస రేటు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) 2016 సంవత్సరంలో ఎంసీఎల్‌ఆర్‌ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వివిధ రకాల రుణాల వడ్డీ రేట్లు నిర్ణయించబడతాయి. బ్యాంకులు రుణాలను అందించడానికి ఇది అంతర్గత సూచన రేటు. బ్యాంక్ 30 సెప్టెంబర్ 2019 వరకు ఎంసీఎల్‌ఆర్ లింక్డ్ హోమ్ లోన్‌లను అందిస్తోంది.
ఆర్‌బీఐ రెపో రేటును పెంచిన తర్వాత ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్, ఎంసీఎల్‌ఆర్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ పాలసీ రెపో రేటు లేదా బ్యాంకులకు స్వల్పకాలిక రుణాల రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.90 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి