SBI Kavach Personal Loan: కరోనా బారిన పడిన వారికి ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్‌.. చికిత్స కోసం రుణం.. పూర్తి వివరాలు

SBI Kavach Personal Loan: గత రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షల కారణంగా ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. అయితే కరోనా బారిన పడిన వారికి స్టేట్‌..

SBI Kavach Personal Loan: కరోనా బారిన పడిన వారికి ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్‌.. చికిత్స కోసం రుణం.. పూర్తి వివరాలు
Sbi Kavach Personal Loan
Follow us
Subhash Goud

|

Updated on: Apr 17, 2022 | 9:39 AM

SBI Kavach Personal Loan: గత రెండేళ్లకుపైగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షల కారణంగా ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. అయితే కరోనా బారిన పడిన వారికి స్టేట్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా (SBI) శుభవార్త అందించింది. గతంలో కరోనా బారిన పడిన వారికి కవాచ్‌ స్కీమ్‌ కింద పర్సనల్‌ లోన్‌ను అందించింది. ఇప్పుడు మళ్లీ ఫోర్ట్‌వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయి. గతంలో కరోనా బారిన పడిన వారు ఈ కవాచ్‌ కింద వ్యక్తిగత రుణాలను అందుకున్నారు. తాజాగా ఢిల్లీ, మహారాష్ట్ర వంటి జనసాంద్రత ఉన్న రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా బారిన పడిన వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు తీసుకుంటూ, సామాజిక దూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని సూచిస్తున్నారు అధికారులు. ఇక దేశంలో చాలా మంది వ్యాక్సినేషన్‌ తీసుకున్నారు. ఇప్పుడు 18 ఏళ్లు పైబడిన వారికి కూడా బూస్టర్ డోస్ ఇస్తున్నారు. మరోవైపు, 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కరోనా బారిన పడిన వారికి ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. అలాంటి సమయంలో ఎస్‌బీఐ రుణాలను అందిస్తోంది. అత్యవసర చికిత్స నిమిత్తం ఈ కవాచ్‌ పథకాన్ని అమలు చేస్తోంది.

SBI కవాచ్ పర్సనల్ లోన్ అనేది ఎమర్జెన్సీకి ఉత్తమమైన మార్గం. కోవిడ్ చికిత్స కోసం డబ్బుల పరంగా ఇబ్బందులు పడకుండా స్టేట్ బ్యాంక్ ఈ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. మీరు మీ లేదా కుటుంబ సభ్యుల చికిత్స కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి సులభమైన వాయిదాలపై వ్యక్తిగత రుణాన్ని తీసుకోవచ్చు. ఇందులో మీరు ఎలాంటి అదనపు ఛార్జీలు లేదా ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ లేదా ఫోర్‌క్లోజర్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని బ్యాంకు పేర్కొంది. నిబంధనల ప్రకారం.. ఏప్రిల్ 1, 2021న లేదా ఆ తర్వాత కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు ఈ లోన్ స్కీమ్‌ను ఉపయోగించుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ప్రస్తుతం కరోనా కవాచ్ పర్సనల్ లోన్ (SBI కవాచ్ పర్సనల్ లోన్) కోసం 8.5% స్థిర వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాన్ని అందిస్తోంది. కరోనా కవాచ్ మాదిరిగానే అనేక ఇతర బ్యాంకులు వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. అయితే వాటి వడ్డీ రేట్లు భిన్నంగా ఉంటాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 10.25 నుండి 21 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తుండగా, స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 8.50 శాతం స్థిర వడ్డీ రేటుతో రుణాలు ఇస్తోంది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.90 నుంచి 14.50 శాతం వడ్డీతో వ్యక్తిగత రుణాన్ని అందిస్తోంది. ICICI బ్యాంక్ ఛార్జ్ 10.50-19 శాతం వరకు ఉంటుంది.

కరోనా కవాచ్‌ ప్రత్యేకత ఏమిటి?:

స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (SBI) కరోనా కవాచ్‌లో మూడు ప్రత్యేకతలున్నాయి. దీని ప్రాసెసింగ్ రుసుము, ముందస్తు చెల్లింపు రుసుము లాంటివి చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు కోవిడ్ చికిత్స కోసం కరోనా కవాచ్ పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు మీరు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నట్లు. అలాగే మీరు తీసుకున్న రుణాన్ని ముందస్తుగా చెల్లించాలని అనుకుంటే ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు నిర్ణీత వ్యవధి కంటే ముందే చెల్లించి రుణ ఖాతాను క్లోజ చేయాలనుకుంటే అందుకు సంబంధించని ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని బ్యాంకు తెలిపింది. ఈ లోన్ తీసుకోవాలంటే మీరు SBI కస్టమర్ అయి ఉండాలి. మీరు జీతం, స్వయం ఉపాధి లేదా పెన్షనర్ అయితే ఈ స్కీమ్‌ కింద రుణం పొందేందుకు అర్హులు.

SBI కరోనా కవాచ్ పర్సనల్ లోన్) వడ్డీ రేటు 8.5 శాతం. మీరు పొందిన రుణాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించుకోవచ్చు. ఒక వ్యక్తి రూ. 25,000 రుణం తీసుకుంటే సంవత్సరం పాటు నెలకు రూ. 2,180 EMI ఉంటుంది. మీకు 2-సంవత్సరాల లోన్ ఉన్నట్లయితే నెలకు రూ. 1,136, 3 సంవత్సరాల రుణానికి రూ.789, 4 సంవత్సరాల రుణానికి రూ.616, 5 సంవత్సరాల రుణానికి రూ.513 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. రూ.2 లక్షల రుణం తీసుకుంటే 1 సంవత్సరానికి రూ.17,444, 2 సంవత్సరాలకు రూ.9,091, మూడేళ్లకు రూ.6,314, నాలుగేళ్లకు రూ.4,930, ఐదేళ్లకు ఏళ్ల రుణానికి రూ.4,103 ఈఎంఐ రూపంలో చెల్లించుకోవ్చు. SBI కరోనా కవాచ్ పర్సనల్ లోన్‌లో రూ. 5 లక్షలు తీసుకుంటే, ఒక సంవత్సర కాలంలో నెలకు EMI రూ. 43,610, 2 సంవత్సరాలకు రూ. 22,728, మూడు సంవత్సరాలకు రూ. 15,784, నాలుగు సంవత్సరాలకు రూ. 12,324, ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో నెలకు రూ. 10,258 ఈఎంఐ చెల్లించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

RBI Alert: ఆ నోట్లు ఉన్న వారికి RBI అలర్ట్.. వెంటనే అలా చేయాలని సూచన..

Credit Card: ఆ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా.. రూ.35 వేలు డిస్కౌంట్ పొందండిలా..!