AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Policy Loan: మీరు బీమా పాలసీపై కూడా లోన్‌ తీసుకోవచ్చు.. రుణం పొందాలంటే ఎలాంటి పత్రాలు అవసరం..!

Policy Loan: బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ కంపెనీల మాదిరిగానే మీరు కూడా మీ బీమా పాలసీపై లోన్ తీసుకోవచ్చు. మీరు ఇన్సూరెన్స్ పాలసీలో డబ్బు పెట్టుబడి పెట్టారు కాబట్టి,..

Policy Loan: మీరు బీమా పాలసీపై కూడా లోన్‌ తీసుకోవచ్చు.. రుణం పొందాలంటే ఎలాంటి పత్రాలు అవసరం..!
Subhash Goud
|

Updated on: Apr 17, 2022 | 10:31 AM

Share

Policy Loan: బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ కంపెనీల మాదిరిగానే మీరు కూడా మీ బీమా పాలసీపై లోన్ తీసుకోవచ్చు. మీరు ఇన్సూరెన్స్ పాలసీలో డబ్బు పెట్టుబడి పెట్టారు కాబట్టి, అదే ప్రాతిపదికన మీకు రుణం కూడా ఇవ్వబడుతుంది. ఇది ఒక రకమైన వ్యక్తిగత రుణం. కంపెనీలు తమ కస్టమర్లకు తిరిగి చెల్లించడం కోసం డిస్కౌంట్లను అందిస్తాయి. మీరు నిర్ణీత వ్యవధి కంటే ముందే రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించాలనుకుంటే, మీరు దానిని తిరిగి చెల్లించవచ్చు. దీనికి అధిక రుసుము విధించే నిబంధన లేదు. అయితే ఇక్కడ పెద్ద సమస్య వడ్డీ రేటు. బ్యాంకులు (Banks) లేదా ఫైనాన్స్ కంపెనీ (Finance Company)లతో పోలిస్తే బీమా లోన్ వడ్డీ రేటు ఖరీదైనది . బీమా కంపెనీలు ఎక్కువ వడ్డీ వసూలు చేయడమే ఇందుకు కారణం.

అయితే, బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలతో పోలిస్తే ఎక్కువ డబ్బును లోన్ రూపంలో తీసుకోవచ్చు. 25 కోట్ల వరకు కూడా రుణం తీసుకునే వెలుసుబాటు ఉంటుంది. రుణం తీసుకునే అర్హత విషయానికొస్తే, బీమా కంపెనీలు ఈ విషయంలో సడలింపు ఇస్తాయి. ఇతర లోన్‌లతో పోలిస్తే ఎక్కువ డాక్యుమెంట్‌లు అవసరమయ్యే చోట, బీమా రుణానికి అతి తక్కువ సంఖ్యలో డాక్యుమెంట్‌లు అవసరం ఉంటుంది.

కనిష్టంగా 18 ఏళ్లు, గరిష్టంగా 70 ఏళ్ల వ్యక్తి బీమాపై రుణం తీసుకోవచ్చు. జీతం లేదా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తి ఈ లోన్ తీసుకోవచ్చు. రూ. 3,00,000 వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తి బీమా రుణం తీసుకోవచ్చు. దీని కోసం రుణదాత CIBIL లేదా క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. రుణ మొత్తాన్ని 15-20 సంవత్సరాల వ్యవధిలో తిరిగి చెల్లించవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి:

మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం సరైందేనా అని బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీని అడగడం ఉత్తమం. అక్కడి నుంచి వచ్చే సమాధానాల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. వాస్తవానికి బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీలు మీ బీమా పాలసీ ప్రకారం రుణ మొత్తాన్ని నిర్ణయిస్తాయి. దీని తర్వాత మీరు బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీలకు బీమా పత్రాన్ని సమర్పించాలి. దీని ఆధారంగా మీరు రుణాన్ని పొందుతారు. పాలసీపై రుణం కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత 3-4 రోజుల్లో రుణ డబ్బు విడుదల చేస్తారు.

ఏ పత్రాలు అవసరం:

బీమా పాలసీకి లోన్ పొందడానికి మీరు తప్పనిసరిగా అడ్రస్ ప్రూఫ్, ID ప్రూఫ్, ఇన్సూరెన్స్ పాలసీ పేపర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, KYC డాక్యుమెంట్‌లను కలిగి ఉండాలి. రుణ చెల్లింపు వ్యవధి రుణదాతపై ఆధారపడి ఉంటుంది. తదనుగుణంగా వడ్డీ రేటు కూడా నిర్ణయించబడుతుంది.

ఇవి కూడా చదవండి:

SBI Kavach Personal Loan: కరోనా బారిన పడిన వారికి ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్‌.. చికిత్స కోసం రుణం.. పూర్తి వివరాలు

PAN Misused: మీ పాన్ దుర్వినియోగం అయ్యిందా..? ఇలా చెక్‌ చేసి ఫిర్యాదు చేయండి..?

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..