SBI Customers: ఎస్‌బిఐ కస్టమర్లకు ముఖ్య గమనిక.. మీరు ఎంత రుణం పొందవచ్చో ఇలా తెలుసుకోండి..

|

Sep 02, 2021 | 8:20 AM

SBI Customers: కస్టమర్లు బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడమే కాదు.. అవసరానికి రుణాలు కూడా పొందవచ్చు అనే విషయం తెలిసిందే. ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్..

SBI Customers: ఎస్‌బిఐ కస్టమర్లకు ముఖ్య గమనిక.. మీరు ఎంత రుణం పొందవచ్చో ఇలా తెలుసుకోండి..
Sbi
Follow us on

SBI Customers: కస్టమర్లు బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడమే కాదు.. అవసరానికి రుణాలు కూడా పొందవచ్చు అనే విషయం తెలిసిందే. ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్‌తో సహా ఖాతాదారులకు బ్యాంక్ ద్వారా వివిధ రకాల రుణాలు ఇవ్వబడతాయి. సాధారణంగా బ్యాంక్ నుండి రుణం తీసుకునే వారు.. ముందుగా బ్యాంక్‌ను సంప్రదిస్తారు. ఆ తరువాత ఎంత రుణం పొందవచ్చో తెలుసుకుంటారు. అలా పర్సనల్ లోన్‌కి సంబంధించిన ఫైల్ ముందుకు సాగుతుంది. అయితే, ఇందంతా సుధీర్ఘ ప్రక్రియ. ప్రస్తుతం ప్రీ అప్రూవుడ్ లోన్‌లో ఈ ఇబ్బంది ఉండదు.

ఒకవేళ మీరు కూడా ఈ విధమైన రుణాలు పొందాలనుకుంటే.. ఎస్‌బీఐ మీకోసం ప్రత్యేక రుణాన్ని మంజూరు చేస్తోంది. ఈ రుణం పొందడానికి కస్టమర్లు సుధీర్ఘ ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం లేదు. సులభంగానే రుణం పొందవచ్చు. ఈ లోన్‌లో మీ ఖాతా ప్రకారం ఎంత రుణం పొందగలుగుతారో క్లియర్‌గా పేర్కొంటారు. అలా సులభంగా లోన్ పొందవచ్చు. ప్రీ అప్రూవుడ్ పర్సనల్ లోన్‌లో మీ అకౌంట్ లిమిట్స్ ఏంటి? ఎంత వరకు రుణం పొందవచ్చో ముందుగానే తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.

పరిమితిని ఎలా చెక్ చేయాలి?
మీరు ప్రీ-అప్రూవ్డ్ లోన్ పరిమితిని తెలుసుకోవాలనుకుంటే, ఒక పని చేయాల్సి ఉంటుంది. సంబంధిత బ్యాంక్‌లకు మెసేజ్ పంపాలి. ఆ తరువాత పూర్తి సమాచారంతో కూడిన ఓ సందేశం నమోదిత మొబైల్ నెంబర్‌కు అందుతుంది. అయితే మీరు ఏం చేయాలంటే.. PAPL <space> XXXX అని రాసి.. ఆపై 567676 నెంబర్‌కు మెసేజ్ సెండ్ చేయాలి. ఈ XXXX లో మీ అకౌంటర్ నెంబర్‌లోని చివరి 4 అంకెలను రాయాల్సి ఉంటుంది.

రుణం ఎలా పొందాలి?
బ్యాంక్ ముందస్తుగా ఆమోదించబడిన వ్యక్తిగత రుణ సదుపాయాన్ని యోనో అప్లికేషన్ ద్వారా పొందవచ్చు. ఈ సదుపాయం తక్షణ, కాగిత రహిత, విశ్లేషణ ప్రక్రియ ఆధారంగా పనిచేస్తుంది. యోనోలోకి లాగిన్ అయిన తర్వాత మీరు ఈ లోన్ ఆఫర్‌ను హోమ్ పేజీలో చూస్తారు.

పీఏపీఎల్ అంటే ఏమిటి?
పీఏపీఎల్‌ అంటే ప్రీ అప్రూవ్‌డ్ పర్సనల్ లోన్. దీనిలో గరిష్ట లోన్ మొత్తం ముందుగానే నిర్ణయిస్తారు. ఇది మీ అకౌంట్ లావాదేవీ, క్రెడిట్ స్కోర్ మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీకున్న పరిధిలో గరిష్ట మొత్తంలో ఏంతైనా రుణం తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో పేపర్ వర్క్ అవసరం లేదు.

ఈ రుణం ఎవరు తీసుకోవచ్చు?
మీ అకౌంట్ ఎందులో అయితే ఉందో.. ఆ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు. ఉదాహరణకు మీకు ఎస్‌బీఐలో ఖాతా ఉన్నట్లయితే.. ఎస్‌బీఐ నుంచి లోన్ తీసుకోవచ్చు. అయితే, మీ ఖాతా లావాదేవీల ఆధారంగా మీకు రుణం ఇవ్వాలా వద్దా అని బ్యాంక్ నిర్ణయిస్తుంది. దాని ప్రకారం మీకు లోన్ సాంక్షన్ అవుతుంది.

Also read:

Orang national park: రాజీవ్‌గాంధీ పేరు మార్చేసిన రాష్ట్ర సర్కార్.. ఇకపై ఒరాంగ్‌ నేషనల్‌ పార్కుగా నామకరణం

Pawan Kalyan: పవన్ పుట్టిన రోజున అదిరిపోయే సర్‏ప్రైజ్‏లు.. ఈరోజు వరుస అప్‏డేట్స్.. ఫ్యాన్స్‏కు ఇక పండగే..

IND Vs ENG: సిరీస్‌పై కన్నేసిన ఇంగ్లాండ్.. ప్రతీకారంతో కోహ్లీసేన.. తుది జట్టులో మార్పులు.?