SBI కస్టమర్లకు అలర్ట్.. తొందరగా ఈ పనిని చేయండి.. మరోసారి హెచ్చరించిన బ్యాంకు.. చివరి తేదీ ఎప్పుడంటే..

|

Jun 01, 2021 | 4:01 PM

State Bank Of India: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తమ కస్టమర్లకు ఎలప్పుడూ

SBI కస్టమర్లకు అలర్ట్.. తొందరగా ఈ పనిని చేయండి.. మరోసారి హెచ్చరించిన బ్యాంకు.. చివరి తేదీ ఎప్పుడంటే..
State Bank Of India
Follow us on

State Bank Of India: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తమ కస్టమర్లకు ఎలప్పుడూ అందుబాటులో ఉంటుందన్న సంగతి తెలిసిందే. అకౌంట్ వివరాల నుంచి సరికొత్త నియమ నిబంధనలకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తమ కస్టమర్లకు తెలియజేస్తూ ఉంటుంది. ఇటీవల డోర్ స్టేప్ సేవల గురించి పూర్తి వివరాలను ట్విట్టర్ ఖాతా ద్వారా తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచిన ఎస్బీఐ తాజాగా మరోసారి తమ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్ పంపింది. మరోసారి తన ఖాతాదారులను సోషల్ మీడియా ద్వారా అలర్ట్ చేసింది.

ఎస్బీఐ ఖాతాదారులు తమ పాన్ కార్డును ఆధార్ నెంబర్ తో లింక్ చేసుకోవాలని కోరింది. పాన్ కార్డ్ నంబరును ఆధార్ నెంబర్ తో లింక్ చేసుకోవడానికి జూన్ 30 వరకు గడువు ఇచ్చింది. ఈలోపు ఎస్బీఐ కస్టమర్లు రెండింటినీ లింక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు గడువు సమయంలోపు పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. డియాక్టివేట్ అవుతుంది. దీంతో మీరు జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రూల్స్ ప్రకారం రూ. 1000 జరిమాన పడుతుంది. ఈ క్రమంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ట్విట్టర్ వేదికగా.. తన కస్టమర్లు అందరూ కచ్చితంగా వారి పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవాలని కోరింది. నిరంతరాయంగా బ్యాంకింగ్ సేవలు అందుకోవడానికి పాన్ కార్డు్ను ఆధార్ తో లింక్ చేసుకోవాలని కోరింది. అలాగే ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ద్వారా సులభంగానే పాన్, ఆధార్ లింక్ చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు.. UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి పాన్ నెంబర్ ఎంటర్ చేసి 567678 లేదా 56161 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపిస్తే సరిపోతుంది.

ట్వీట్..

Also Read: టైప్ చేసే అక్షరాలకు ఎమోషన్స్ ఉండవు.. రాసే ప్రతి అక్షరానికి ఫీలింగ్ ఉంటుంది.. ఇంట్రెస్టింగ్‏గా 18 Pages ఫస్ట్‏లుక్ పోస్టర్..

Karan Mehra: పాపులర్ టీవీ యాక్టర్ కరణ్ మెహ్రా అరెస్ట్.. తనను కొట్టాడంటూ భార్య ఫిర్యాదు.. ఆ వెంటనే..