Buisness Ideas: మీ సొంత బిజినెస్‌ బ్రాండ్‌ క్రియేట్‌ చేసుకోవాలని ఉందా? అయితే తక్కువ పెట్టుబడితో ఇదే బెస్ట్‌ బిజినెస్‌!

మీరు తక్కువ పెట్టుబడితో క్లాతింగ్ బ్రాండ్ ప్రారంభించాలనుకుంటున్నారా? కేవలం రూ.25,000తో మీ వస్త్ర వ్యాపారాన్ని మొదలుపెట్టండి. సూరత్ నుండి టీ-షర్ట్‌లు, షర్ట్‌లు కొనుగోలు చేసి, మీ లోగో ముద్రించి, ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో విక్రయించండి. సృజనాత్మకత, సరైన మార్కెటింగ్ వ్యూహాలతో యువతను ఆకట్టుకొని క్లాతింగ్ రంగంలో విజయవంతం అవ్వండి.

Buisness Ideas: మీ సొంత బిజినెస్‌ బ్రాండ్‌ క్రియేట్‌ చేసుకోవాలని ఉందా? అయితే తక్కువ పెట్టుబడితో ఇదే బెస్ట్‌ బిజినెస్‌!
Final Settlement

Updated on: Dec 29, 2025 | 10:23 AM

చాలా మంది యువతకు ఒక మంచి బిజినెస్‌ చేయాలని ఉంటుంది. అయితే అందరిలా ఏదో ఒక బిజినెస్‌ కాకుండా తమ కంటూ ఒక బ్రాండ్‌ ఉండాలని అనుకుంటారు. అలా తమ పేరుతోనో లేక తమకు నచ్చిన పేరుతో ఒక బ్రాండ్‌ను క్రియేట్‌ చేయాలంటే క్లాతింగ్‌ బిజినెస్‌ ఒక బెస్ట్‌ బిజినెస్‌ ప్లాన్‌ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడూ డిమాండ్‌ ఉండే బిజినెస్‌ ఏదైనా ఉందంటే అది క్లాతింగ్‌ బిజినెస్‌. కొంత ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తూ యూత్‌ను ఆకట్టుకోగలిగితే క్లాతింగ్‌ బిజినెస్‌లో తక్కువ టైమ్‌లో సక్సెస్‌ అవ్వొచ్చు.

మరి ఇలాంటి బిజినెస్‌ స్టార్ట్‌ చేయడానికి భారీగా పెట్టుబడి కావాలని కొంతమంది అనుకోవచ్చు. బట్‌ అలాంటిదేం లేదు. అతి తక్కువ బడ్జెట్‌లో కూడా ఈ బిజినెస్‌ను స్టార్ట్‌ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. మీరు ఒక మంచి క్లాతింగ్‌ బ్రాండ్‌ను క్రియేట్‌ చేయాలనుకుంటే.. మీకు బట్టల విషయంలో మంచి అభిరుచి ఉండాలి. అలాంటే ట్రెండ్‌, లెటెస్ట్‌ ఫ్యాషన్‌పై కాస్త అవగాహన, క్రియేటివిటీ ఉండాలి. ఈ క్లాతింగ్‌ బిజినెస్‌ స్టార్ట్‌ చేయడానికి ముందుగా మీరు మీ బిజినెస్‌కు ఒక పేరు పెట్టుకోండి, ఆ పేరుతో ఒక స్టైలిష్‌, క్లాసీ లోగో డిజైన్‌ చేయించుకోండి.

గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లి అతి తక్కువ ధరలో క్వాలిటీ ప్లెయిన్‌ టీషర్లు, షర్లు కొనుగోలు చేయండి, లేదంటే టైలరింగ్‌పై అవగాహన ఉంటే మంచి క్లాత్‌ కొనుగోలు చేసి మీకు నచ్చిన విధంగా స్టిచ్చింగ్‌ చేయించండి. వాటిపై మీ లోగోను ముద్రించండి. ప్రారంభంలో మీ ఫ్రెండ్స్‌ సర్కిల్, ఫ్యామిలీ సర్కిల్‌తో తక్కువ మార్జిన్‌కు వాటిని అమ్మండి. వారి నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకొని విలువైన సూచనలు సలహాలు వాస్తే వాటిని కాస్త అప్డేట్‌ చేయండి. ఆ తర్వాత మార్కెట్‌లో మీ బ్రాండ్‌ బట్టలను రిలీజ్‌ చేయండి, ఆన్‌లైన్‌లో కూడా విక్రయించవచ్చు. అందుకోసం జీఎస్టీ నంబర్‌ అవసరం. అవసరం అయితే అది కూడా తీసుకోండి. అలా మీ బట్టల బిజినెస్‌ను ఒక బ్రాండ్‌లా మార్చుకోండి. ఈ బిజినెస్‌ను స్టార్ట్‌ చేసేందుకు బట్టల కోసం ఒక రూ.10 వేలు, లోగో ప్రింటింగ్‌ మెషీన్‌ కోసం ఓ రూ.5000, అలాగే ప్యాకింగ్‌ కోసం మరో రూ.10 వేలు అవుతుంది. దీన్ని ఇంట్లో ఒక రూమ్‌లోనే చేసుకోవచ్చు. స్టాక్‌ పెట్టుకొని, లోగో ప్రింటింగ్‌ మెషీన్‌ను ఒక రూమ్‌లో పెట్టుకొని మీ బిజినెస్‌ను స్టార్ట్‌ చేయొచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి