Business Ideas: ఉన్న ఊర్లోనే కాలు కదపకుండా ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే.. నెలకు రూ. లక్ష వరకు పక్కా.!

|

May 15, 2024 | 11:06 AM

నైన్ టూ సిక్స్ జాబ్ బోర్ కొట్టేసిందా.? ప్రతీ నెలా వచ్చే శాలరీ ఇంటి ఖర్చులకు సరిపోవట్లేదా.? ఏదైనా సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారా.? అయితే మీకోసం రిస్క్ లేని ఓ బిజినెస్ ఐడియాను తీసుకొచ్చేశాం. ఇది రిస్క్ తక్కువ.. లాభాలు ఎక్కువగా వచ్చే మాంచి బిజినెస్.

Business Ideas: ఉన్న ఊర్లోనే కాలు కదపకుండా ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే.. నెలకు రూ. లక్ష వరకు పక్కా.!
Money
Follow us on

నైన్ టూ సిక్స్ జాబ్ బోర్ కొట్టేసిందా.? ప్రతీ నెలా వచ్చే శాలరీ ఇంటి ఖర్చులకు సరిపోవట్లేదా.? ఏదైనా సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారా.? అయితే మీకోసం రిస్క్ లేని ఓ బిజినెస్ ఐడియాను తీసుకొచ్చేశాం. ఇది రిస్క్ తక్కువ.. లాభాలు ఎక్కువగా వచ్చే మాంచి బిజినెస్. పైగా మీ ఊరిలోనే ఉంటూ దీన్ని ప్రారంభించవచ్చు. అంతేకాకుండా వేసవికాలం ఈ బిజినెస్‌కు మంచి ఆప్షన్. మరేది కాదండీ.! మినరల్ వాటర్ ప్లాంట్. ఈ బిజినెస్ ద్వారా ప్రతీ ఏటా 20 శాతం వరకు మీరు వృద్దిని చూడొచ్చు. ఈ మధ్యకాలంలో సిటీ, లేదా అది గ్రామమా అనేది సంబంధం లేకుండా 25 లీటర్ల వాటర్ టిన్లతో లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు కొందరు. అలాగే వాటర్ ప్యాకెట్లు, లీటర్ వాటర్ బాటిల్స్ సేల్ కూడా బాగానే ఉంది. ఈ వ్యాపారం స్టార్ట్ చేయడానికి కావాల్సిందల్లా మీ పాన్ నెంబర్, జీఎస్టీ నెంబర్. అలాగే స్థానిక అధికారుల నుంచి ఈ వ్యాపారానికి సంబంధించి ఓ లైసెన్స్ తెచ్చుకోవాలి.

వీటితో పాటు వాటర్ ప్లాంట్ ప్రారంభించేందుకు ఆర్ఓ ఫిల్టర్‌లతో పాటు మరికొన్ని మిషన్లు కూడా అవసరమవుతాయి. ఇక స్థలం కోసం వేరే చోట వెతకాల్సిన అవసరం లేదు. మీ ఇంటి వద్దనే ఓ 1500 చదరపు గజాల స్థలం ఉంటే అందులోనే పెట్టొచ్చు. ఇవన్నీ పూర్తి కావడానికి దాదాపుగా రూ. 2.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంతేకాదు 25 లీటర్ల సామర్ధ్యం ఉన్న 100 వాటర్ క్యాన్లు కూడా కొనుగోలు చేయండి. వీటికి మీ దగ్గర డబ్బులు ఉంటే ఓకే.. లేకపోయినా బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ఒక మినరల్ వాటర్ బాటిల్ ధర రూ. 20 ఉంటుంది. మీరు రోజుకి 400 వాటర్ క్యాన్లు సప్లై చేస్తే రూ. 10 వేల వరకు వస్తాయి. అలా నెలకు రూ. రెండున్నర నుంచి 3 లక్షల వరకు సంపాదించవచ్చు. కరెంట్ బిల్లు, ఇతరత్రా వాటికి కొంత పోయినా.. నెలకు లక్ష వరకు లాభం మిగులుతుంది.