Business Ideas: జస్ట్‌ రూ.25 వేల పెట్టుబడితో మీ లైఫ్‌ సెట్‌ అయ్యే సూపర్‌ బిజినెస్‌ ఐడియా!

చాలీచాలని జీతంతో ఉద్యోగం చేసే బదులు, తక్కువ పెట్టుబడితో సొంత వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నారా? ఇంటి వద్దే మొబైల్ కారు వాషింగ్ వ్యాపారం ఒక అద్భుతమైన అవకాశం. తక్కువ ఖర్చుతో ప్రారంభించి, ఫెస్టివల్స్ వంటి సమయాల్లో అధిక డిమాండ్ ఉన్న ఈ వ్యాపారం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.

Business Ideas: జస్ట్‌ రూ.25 వేల పెట్టుబడితో మీ లైఫ్‌ సెట్‌ అయ్యే సూపర్‌ బిజినెస్‌ ఐడియా!
Indian Currency 6

Updated on: Nov 03, 2025 | 7:30 AM

చాలీచాలని జీతంతో ఒకరి కింద ఉద్యోగం చేసే బదులు చిన్నదో పెద్దదో ఏదో ఒక వ్యాపారం చేయాలని చాలా మందికి ఉంటుంది. కానీ పెట్టుబడి లేకనో లేక సరైన బిజినెస్‌ ఐడియా తట్టకనో ఆగిపోతుంటారు. అలాంటి వారు తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ప్రారంభించే కొన్ని బిజినెస్‌లు ఉన్నాయి. అతి తక్కువ పెట్టుబడితో మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఏ బిజినెస్‌ స్టార్ట్‌ చేయాలన్నా.. ఒక మంచి ప్లానింగ్ స్ట్రాటజీ మార్కెట్ పట్ల అవగాహన అనేది చాలా ముఖ్యమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక బిజినెస్ మీరు ప్రారంభించినట్లయితే ఆ బిజినెస్ లోని లోతుపాతులన్నీ కూడా మీరు తెలుసుకుని ఉండాలి.

ఆ తర్వాతనే మీరు ఆ రంగంలో పై చేయి సాధించవచ్చు. అలాగే ఏ రంగంలో అయితే మీకు అవసరం ఎక్కువగా ఉందో కస్టమర్లకు మీరు ఆ సేవలను అందించినట్లయితే చక్కగా ఆ బిజినెస్ లో రాణించే అవకాశం ఉంటుంది. అలాంటిదే కారు వాషింగ్‌ బిజినెస్‌. ఈ మధ్యకాలంలో కారు వాషింగ్ అనేది ప్రతి ఒక్కరు చేయించుకుంటున్నారు. నిజానికి ఫెస్టివల్ సమయంలో కార్ వాషింగ్ అనేది ఒక పెద్ద తలకాయ నొప్పి అని చెప్పవచ్చు ఎందుకంటే ఫెస్టివల్ సమయంలో పెద్ద ఎత్తున కార్ వాషింగ్ కు డిమాండ్ ఉంటుంది. కార్ వాషింగ్ సెంటర్లలో కార్లలో వాషింగ్ కు చాలా డిమాండ్ ఉంటుంది. రోజుల తరబడి వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్నే మీరు ఒక మంచి వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలు ఉంది.

కార్ వాషింగ్ ఎట్ హోంతో మంచి ఆదాయం పొందవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా ఒక షాప్‌ అవసరం లేదు. కార్ వాషింగ్ ఇంటి వద్ద చేయడానికి మీరు హ్యాండి కార్ వాషర్ పంప్ సెట్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హ్యాండ్ కార్ వాషింగ్ మెషిన్ ధర రూ.25 వేల నుంచి ప్రారంభం అవుతుంది. మీరు ఇంటి వద్దనే కార్ వాషింగ్ చేస్తామని సోషల్ మీడియా ద్వారా కానీ పాంప్లెట్ ల ద్వారా గాని ప్రచారం చేసినట్లయితే, కస్టమర్లు మీకు ఫోన్ చేసి ఇంటికి వినిపించుకొని కారు వాషింగ్ చేయించుకుంటారు. తద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి