RBI: రుణాలు ఇచ్చే ముందు ఇవి తప్పనిసరి.. బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక నిర్ణయం.. నిబంధనలు మరింత కఠినతరం..!

|

Nov 15, 2021 | 7:00 PM

Loan Payment: బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కస్టమర్ల విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా...

RBI: రుణాలు ఇచ్చే ముందు ఇవి తప్పనిసరి.. బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక నిర్ణయం.. నిబంధనలు మరింత కఠినతరం..!
Follow us on

Loan Payment: బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కస్టమర్ల విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా.. ఆర్బీఐ నిబంధనలు పాటించకపోయినా బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తుంటుంది. అలాగే భారీ ఎత్తున జరిమానా కూడా విధిస్తుంటుంది. ఇక బ్యాంకు మొండి బకాయిల (ఎన్‌పీఏలు) విషయంలో నిబంధనలు మరింత కఠినతరం చేసింది ఆర్బీఐ. నిర్ణీత సమయానికి తీసుకున్న రుణాలు చెల్లించనట్లయితే నిబంధల ప్రకారం ఆయా ఖాతాలను ఎన్‌పీఏగా బ్యాంకులు ప్రకటించి కేటాయింపులు చేయాల్సి ఉంటుందని సూచించింది. ఎన్‌పీఏ అకౌంట్లకు సంబంధించి కేవలం వడ్డీ చెల్లింపులు వచ్చినంత మాత్రనా స్టాండర్డ్‌ అకౌంట్లుగా మార్చవద్దని ఆర్‌బీఐ సూచించింది. ఆయా బ్యాంకులు కస్టమర్లకు రుణాలు ఇచ్చే ముందు వడ్డీతో పాటు అసలు చెల్లింపులు, వాటి నిర్ణీత గడువులను తప్పకుండా పేర్కొనాల్సిందేనని ఆర్బీఐ జారీ చేసిన తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే కొన్ని బ్యాంకులు నాన్ పర్ఫార్మింగ్​అసెట్​(NPA)ల అకౌంట్ల విషయంలో వడ్డీ చెల్లింపులను చేసి స్టాండర్డ్‌ అకౌంట్లుగా మారుస్తున్నట్లు ఆర్బీఐ దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఖాతాదారులకు రుణాలు ఇచ్చే ముందు రుణాన్ని గడువులోగా కచ్చితంగా చెల్లించాలని, అసలు, వడ్డీకి సంబంధించిన విషయాలను బ్యాంకుల రుణ ఒప్పందంలోనే పేర్కొనాలని సూచించింది. ఇంతకు ముందు వడ్డీ చెల్లింపుల విషయంలో ఏదైనా త్రైమాసికంలో చెల్లించాల్సిన వడ్డీని త్రైమాసికం ముగిసిన 90 రోజులలోపు పూర్తిగా చెల్లించకపోతే ఆ ఖాతాను ఎన్‌పీఏగా గుర్తిస్తారు. కానీ ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనల ప్రకారం..  వడ్డీ, వసూలు చేసిన మొత్తం 90 రోజుల కంటే ఎక్కువ కాలంపాటు ఉంటే ఈ ఖాతాను నాన్ పర్ఫార్మింగ్​అసెట్​(NPA)గా గుర్తించబడుతుంది.

ఇవి కూడా చదవండి:

PF UAN Number: మీరు ఈపీఎఫ్‌ఓ యూఏఎన్‌ నంబర్‌ మర్చిపోయారా..? ఇలా చేయండి..!

సామాన్యులకు మరో షాక్‌.. ఈ వస్తువుల ధరలు పెరుగుతాయట.. వెలువడుతున్న నివేదికలు..!