Railway News: రికార్డులు సృష్టిస్తున్న దక్షిణ మధ్య రైల్వే.. రూ.200 కోట్ల ఆదాయార్జనతో ఆల్ టైమ్ రికార్డు..

|

Mar 20, 2022 | 1:44 PM

Railway News: దక్షిణ మధ్య రైల్వే పార్శిళ్ల విభాగంలో మునుపెన్నడూ లేని విధంగా ఆదాయాన్ని ఆర్జించింది. కరోనా సమయంలోనూ ఎదురైన సవాళ్లను అదిగమిస్తూ ముందుకు సాగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ సంజీవ్‌ కిశోర్‌ వెల్లడించారు. 

Railway News: రికార్డులు సృష్టిస్తున్న దక్షిణ మధ్య రైల్వే.. రూ.200 కోట్ల ఆదాయార్జనతో ఆల్ టైమ్ రికార్డు..
South Central Railway
Follow us on

Railway News: రైల్వే మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టబడిన వినూత్న విధానాలతో పాటు జోన్‌లో సజావుగా నిత్యావసరాల సరఫరా(Necessities transport) జరగడానికి కేంద్రీకృత విధానాలను పటిష్టంగా అమలు చేసిన ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పార్సిల్‌ రంగంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అత్యధికంగా  పార్సిల్‌ ఆదాయాన్ని ఆర్జించింది.  2020-21 సంవత్సరంలో పార్సిల్‌లో వార్షిక ఆదాయం మొత్తం రూ.108.3 కోట్లు కాగా.. కరోనా మహమ్మారి తెచ్చిన సవాళ్లను అధిగమిస్తూ పార్సిల్స్‌లో 4.78 లక్షల టన్నుల లోడిరగ్‌ను నిర్వహించి రూ. 200 కోట్ల ఆదాయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వేస్ సాధించింది. భారతీయ రైల్వేలో పార్సిల్‌ స్పేస్‌ కోసం అడ్వాన్స్‌ బుకింగ్‌ సౌకర్యం ఏర్పాటు, షెడ్యూల్ ప్రకారం రైళ్లను నడపటం, స్నేహపూర్వక విధానాలతో ఇది సాధ్యమైంది. నూతన పార్సిల్స్‌ను పొందడంతోపాటు రోడ్డు ద్వారా వెళ్లే పార్సిల్స్‌ను రైలు రవాణాకు మళ్లించడం వంటివి పార్సిల్‌ రంగంలో వృద్ధికి ఊతంగా మారాయి. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, దేశ రాజధానికి పాల రవాణాలో ఈ సేవలు కీలక పాత్రను పోషించాయి. 473 కిసాన్‌ ప్రత్యేక రైళ్ల ద్వారా 1.57 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసి రూ.72.67 కోట్ల ఆదాయాన్ని పొందింది. పాల సరఫరాతో రూ.34.03 కోట్లు, నాన్‌ లీజ్డ్‌ ట్రాఫిక్‌ నుంచి రూ.73.62 కోట్లు, స్పేస్‌ లీజింగ్‌ ద్వారా రూ.20.08 కోట్లు ఆర్జించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ సంజీవ్‌ కిశోర్‌ వెల్లడించారు.

రికార్డు స్థాయిలో ఆదాయం..

కరోనా కారణంగా దక్షిణ మధ్య రైల్వేకు అనేక సవాళ్లు ఎదురైనా.. వాటిని ఇప్పుడిప్పుడే అధిగమిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణాలో మరో అత్యుత్తమమైన మైలు రాయిని దాటింది. 2021-22 సంవత్సరంలో సరకు రవాణాలో 112.51 మిలియన్‌ టన్నుల లోడిరగ్‌ ​ నిర్వహించింది. దీని ద్వారా రికార్డు స్థాయిలో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అన్ని రకాల సరకుల లోడిరగ్‌ అధిక స్థాయిలో జరగడంతో అన్ని రంగాల్లోనూ సరకు రవాణాలో వృద్ధి సాధించింది.

వాటి రవాణాతో పెరిగిన ఆదాయం, లోడిరగ్‌..

గత ఆర్థిక సంవత్సరం 2020-21తో పోలిస్తే సరకు రవాణాలో 17.7 శాతం అధిక ఆదాయాన్ని, 17.3 శాతం అధిక లోడిరగ్‌ను సాధించింది. సరకు రవాణా లోడిరగ్‌ పురోగతిలో బొగ్గు 53.78 ఎమ్‌టీల లోడిరగ్‌తో, సిమెంట్‌ 32.339 ఎమ్‌టీ, ఆహార ధాన్యాలు 7.980 ఎమ్‌టీ, ఎరువులు 5.925 ఎమ్‌టీ, కంటైనర్ల సేవలు 2.137 ఎమ్‌టీ, స్టీల్‌ ప్లాంట్ల కోసం ముడిసరకు 4.14 ఎమ్‌టీ, అల్మూనియా పౌడర్‌, ఫ్లైయాష్‌, గ్రానైట్‌, చెక్కర మొదలైనవి 5.80 ఎమ్‌టీల లోడిరగ్​లో భాగస్వామ్యమయ్యాయి. సరకు రవాణాలో వివిధ వినూత్న పథకాలు చేపట్టడం, పలు స్టేషన్ల మార్గాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో సహా సరకు రవాణా నిర్వహణకు అనేక సౌకర్యాలను మెరుగుపర్చడం వంటి చర్యలతో ఆదాయం, లోడిరగ్‌ వృద్ధి సాధించడానికి తోడ్పడినట్లు రైల్వేశాఖ వెల్లడించింది.

ఇవీ చదవండి..

Home loan EMI: హోమ్ లోన్ డిఫాల్ట్ అయితే.. ఈ 4 సులభమైన పరిష్కార మార్గాలు మీ కోసం

Billionaires: బిలియనీర్లలో భారత్ మూడో స్థానం.. ధనవంతుల్లో ఎక్కువ మంది ఆ నగరాల్లోని వారే..!