EPFO: ఏటీఎమ్‌ నుంచి పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. ఇది కదా గుడ్ న్యూస్‌ అంటే..

|

Nov 30, 2024 | 6:59 PM

దేశంలో ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరికీ పీఎఫ్‌ ఖాతా ఉంటుందనే విషయం తెలిసిందే. ఉద్యోగి జీతంలో కొంత మొత్తాన్ని పీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తుంటారు. ఇందుకు వడ్డీని కూడా అందిస్తుంటారు. అయితే పీఎఫ్‌ ఖాతాలో ఉన్న డబ్బును విత్‌డ్రా చేసుకునే విధానాన్ని మరింత సులభతరం చేసేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది..

EPFO: ఏటీఎమ్‌ నుంచి పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. ఇది కదా గుడ్ న్యూస్‌ అంటే..
Epfo
Follow us on

ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరికీ పీఎఫ్‌ అకౌంట్‌ ఉంటుందనే విషయం తెలిసిందే. ప్రతీ నెల ఉద్యోగి జీతంలో 12 శాతాన్ని ప్రతీ నెల పీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తారు. యజమాని కంపెనీ కూడా అదే మొత్తంలో జమ చేస్తుంది. పీఎఫ్‌ ఖాతా అనేది మంచి పొదుపు పథకంలాగా పనిచేస్తుంది. ఇందులో డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీ లభిస్తుంది. ఉద్యోగులకు ఉన్నపలంగా డబ్బు అవసరపడితే ఈ మొత్తాన్ని ఉపయోగించుకునే అవకాశం కల్పించారు.

సాధారణంగా పీఎఫ్‌ అకౌంట్‌లో ఉన్న డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్‌ ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల పనిదినాల తర్వాత అకౌంట్‌లోకి డబ్బు జమ అవుతుంది. ఇదంతా పెద్ద ప్రాసెస్‌ అయితే ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. సేవింగ్స్‌ ఖాతా నుంచి ఏటీఎమ్‌ ద్వారా డబ్బులు విత్‌ డ్రా చేసుకునే విధంగా పీఎఫ్‌ ఖాతాలో డబ్బులు విత్‌డ్రా చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకున్నారు.

ఇందులో భాగంగానే ఈపీఎఫ్‌వో 3.0 పథకం కింద పీఎఫ్ ఖాతాదారుల కోసం కొత్త సౌకర్యాలను తీసుకువస్తోంది. EPFO 3.0 కింద, PF ఖాతాదారులకు త్వరలో ఏటీమ్‌ కార్డును పోలిన ఒక కార్డును ఇవ్వనున్నారు. దీని సహాయంతో ఈపీఎఫ్‌ఓ మెంబర్స్‌ పీఎఫ్‌ ఖాతా నుంచి ఏటీఎమ్‌ నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం త్వరలోనే ఈపీఎఫ్‌ఓ 3.0 విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది. వచ్చే ఏడాది మే-జూన్ నాటికి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తే ఉద్యోగులు పీఎఫ్‌ మొత్తాన్ని చాలా సులభంగా పొందొచ్చు. అయితే ఇందుకోసం ముందుగా ఏదైనా దరఖాస్తు చేసుకోవాలా.? ఏ అంశాల ఆధారంగా పీఎఫ్‌ అమౌంట్‌ను అందిస్తారు. లాంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ కొత్త విధానానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..