Silve Rate Today: దేశంలో బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ధర.. తాజాగా పరుగులు పెడుతోంది. అయితే బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉందని కొందరు చెబుతుండగా, దీపావళి నాటికి పెరిగే అవకాశాలున్నాయిన మరి కొందరు బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బుధవారం దేశీయంగా కిలో వెండి ధరపై రూ.250 మేర పెరిగింది. అయితే దేశంలో కొన్ని ప్రాంతాల్లో వెండి ధరలు నిలకడగా ఉండగా, కొన్ని ప్రాంతాల్లో పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70, 000 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.70,000 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.75,300 ఉండగా, కోల్‌కతాలో రూ.70,000 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.70,000 ఉండగా, కేరళలో రూ.70,000 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,300 ఉండగా, విజయవాడలో రూ.75,300 ఉంది.
అయితే నిజానికి దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశాలు ఇప్పుడు లేవు. ఎందుకంటే… ఏడాది నుంచి బంగారం, వెండి కొనుగోళ్లు చాలా తగ్గిపోయాయి. విదేశాల నుంచి బంగారు దిగుమతులు కూడా తగ్గాయి. ప్రజల దగ్గర బంగారం, వెండి కొనేంత డబ్బు లేదు. కరోనా మహమ్మారి కారణంగా ఉన్న ఉద్యోగాలు పోయాయి. అందువల్ల ఎవరూ బంగారం కొనే పరిస్థితుల్లో లేరు. ఇంకా చెప్పాలంటే చాలా మంది డబ్బు కోసం బంగారం తాకట్టు పెట్టేస్తున్నారు. బంగారంపై పెట్టుబడులు కూడా బాగా తగ్గాయి. ఇలాంటప్పుడు బంగారానికి డిమాండ్ పడిపోయి ధరలు బాగా తగ్గాలి. కానీ గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
Gold Price Today: మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు