
Silver Price Today: బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇక బంగారం బాటలో వెండి కూడా పయనిస్తోంది. పసిడి పెరిగినట్లు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. గత రెండు నెలల కిందట తగ్గుముఖం పట్టిన వెండి ధర.. మే నెల నుంచి క్రమ క్రమంగా పెరుగుతూ వస్తోంది. తాజాగా మంగళవారం కిలో వెండి పై రూ.400లకుపైగా పెరిగింది. ఇక దేశ దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,000 ఉండగా, చెన్నైలో 76,800 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ. 72,200 ఉండగా, కోల్‌కతాలో రూ.72,000 ఉంది. అలాగే బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,000 ఉండగా, కేరళలో రూ.72,000 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,000 ఉండగా, విజయవాడలో రూ.72,000 ఉంది. అయితే దేశీయంగా వెండి ధరలను పరిశీలిస్తే అన్ని ప్రధాన నగరాల్లో ధరలు ఒకేలా ఉన్నాయి. ఎక్కడ కూడా హెచ్చులు తగ్గులు లేవు.