Silver Price Today: మళ్లీ పెరిగిన వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు ఇలా..!

|

Jul 23, 2021 | 6:07 AM

Silver Price Today: పసిడి ధరలు రెండో రోజు తగ్గుముఖం పడుతుంటే.. వెండి ధర మాత్రం ఎగబాకుతోంది. భారతీయ సాంప్రదాయంలో బంగారం, వెండికి అత్యంత..

Silver Price Today: మళ్లీ పెరిగిన వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు ఇలా..!
Follow us on

Silver Price Today: పసిడి ధరలు రెండో రోజు తగ్గుముఖం పడుతుంటే.. వెండి ధర మాత్రం ఎగబాకుతోంది. భారతీయ సాంప్రదాయంలో బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే తాజాగా శుక్రవారం వెండి ధర పెరిగింది. వెండి ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా దేశీయంగా వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోలలో)

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,900 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.66,900 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.71,900 ఉండగా, కోల్‌కతాలో రూ.66,900 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.66,900 ఉండగా, కేరళలో రూ.66,900 ఉంది. ఇక అహ్మదాబాద్‌లో కిలో వెండి రూ.66,900 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,900 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.71,900 ఉండగా, విశాఖపట్నంలో రూ.71,900 ఉంది.

అయితే బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Gold Price Today: కొనసాగుతోన్న బంగారు ధరల పతనం.. వరుసగా రెండో రోజు. శుక్రవారం భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్‌..

JioFiber: రిలయన్స్‌ జియో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. కేవలం 199 రూపాయలకే 1000జీబీ డేటా..!