Silver Price Today: మహిళలు బంగారం, వెండికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారంతో పాటు వెండి కొనుగోళ్లు కూడా భారీగానే జరుగుతుంటాయి. సాధారణంగా దేశంలో బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తే, వెండి ధరలు సైతం పెరుగుతాయి. గోల్డ్ ధరలు తగ్గితే, సిల్వర్ ధరలు కూడా తగ్గుతాయి. తాజాగా శుక్రవారం (డిసెంబర్ 31)న వెండి ధర దిగివచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలలోపు నమోదైనవి మాత్రమే. మళ్లీ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. అయితే తాజాగా ధరలు కొన్ని నగరాల్లో స్థిరంగా ఉంటే.. కొన్ని నగరాల్లో స్వల్పంగా దిగి వచ్చింది.
* దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ. 61,600 లుగా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కూడా వెండి ధరలో తగ్గుదల కనిపించింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 61,600గా కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 65,500 గా ఉంది.
* బెంగళూరులో గురువారం కిలో వెండి ధర రూ. 61,600 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 65,500గా ఉంది.
* విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 65,500గా ఉంది.
* విశాఖపట్నంలో సిల్వర్ రేట్ రూ. 65,500 వద్ద కొనసాగుతోంది.
అయితే ప్రతి రోజు బంగారం, వెండి ధరలలో ఎన్నో మార్పులు ఉంటాయి. ఇలా బంగారం, వెండి ధరలలో మార్పులు కావడానికి ఎన్నో కారణాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read: IRCTC Tour Package: పర్యటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్.. అదిరిపోయే టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలు
Gold Price: వినియోగదారులకు కొత్త ఏడాదిలో బంగారం ధరలు షాకివ్వనున్నాయా..? కారణం ఏమిటి..?