Silver Price Today: వెండి కొనుగోలుదారులకు షాకింగ్‌.. భారీగా పెరిగిన సిల్వర్‌ ధర.. ప్రధాన నగరాల్లో..

|

Nov 06, 2021 | 6:23 AM

Silver Price Today: కొనుగోలుదారులకు షాకిచ్చింది వెండి. ఒక వైపు బంగారం ధర కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగి, మరి కొన్ని

Silver Price Today: వెండి కొనుగోలుదారులకు షాకింగ్‌.. భారీగా పెరిగిన సిల్వర్‌ ధర.. ప్రధాన నగరాల్లో..
Silver Price Today
Follow us on

Silver Price Today: కొనుగోలుదారులకు షాకిచ్చింది వెండి. ఒక వైపు బంగారం ధర కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగి, మరి కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గింది. ఇక శనివారం వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. ముఖ్యంగా వెండి కొనుగోళ్లు కూడా ప్రతి రోజు భారీగానే జరుగుతుంటాయి. వెండి దీపాలు, వెండి విగ్రహాలు, వెండి పాత్రలు కొనుగోలు చేస్తుంటారు. కిలో వెండిపై రూ.1000 నుంచి రూ.1800 వరకు పరుగులు పెట్టింది. ఇక శనివారం (నవంబర్‌ 6)న దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

► దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.64,300.
► చెన్నైలో కిలో వెండి ధర రూ.68,600.
► ముంబైలో కిలో వెండి రూ.64,300.
► కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.64,300.
► బెంగళూరులో కిలో వెండి రూ.64,300.
► కేరళలో కిలో వెండి ధర రూ.68,600.
► హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,600.
► విజయవాడలో రూ. 68,600 వద్ద కొనసాగుతోంది.

కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్‌సైట్ల ఆధారంగా వెండి ధరలు ఉంటాయి. బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు అనేక మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు మార్పులు కావడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి.

ముఖ్య విషయం ఏంటంటే.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

Also Read:

Gold Price Today: షాకిస్తున్న బంగారం ధరలు.. కొన్ని ప్రాంతాల్లో పెరిగితే.. మరి కొన్ని చోట్ల తగ్గింది.. ఎక్కడెక్కడ అంటే..

Watch Video: తిరుమల బైపాస్‌లో జనంపైకి దూసుకెళ్లిన కారు.. కొనుగోలు చేసి తీసుకొస్తుండగా.. వీడియో