Employees: ఆ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇక రెండు, నాలుగో శనివారాల్లో సెలవు

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ప్రతినెలా రెండో, నాలుగో శనివారాల్లో ఉద్యోగులకు సెలవులు ప్రకటించింది. ఇందులోభాగంగా ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పనివేళలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు సిబ్బంది శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉదయం 10 గంటలకు కార్యాలయానికి..

Employees: ఆ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇక రెండు, నాలుగో శనివారాల్లో సెలవు
Employees
Follow us
Subhash Goud

|

Updated on: Jul 14, 2024 | 8:31 AM

సిక్కిం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ప్రతినెలా రెండో, నాలుగో శనివారాల్లో ఉద్యోగులకు సెలవులు ప్రకటించింది. ఇందులోభాగంగా ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పనివేళలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు సిబ్బంది శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉదయం 10 గంటలకు కార్యాలయానికి చేరుకోవాలని, సాయంత్రం 4:30 గంటల వరకు తమ తమ కార్యాలయాల్లో ఉండాలని ప్రభుత్వం సర్క్యులర్‌లో పేర్కొంది. ఒక ఉద్యోగి 10:30 గంటల తర్వాత కార్యాలయానికి చేరుకున్నట్లయితే లేదా చెల్లుబాటు అయ్యే అధికారిక కారణాలు లేకుండా సాయంత్రం 4:30 గంటలలోపు కార్యాలయం నుండి బయలుదేరినట్లయితే, అతని ఆఫ్‌డే డ్యూటీగా నిర్వహించినట్లు పరిగణిస్తామని తెలిపింది. ఉద్యోగుల హాజరును ఆకస్మికంగా తనిఖీ చేయాలని డిపార్ట్‌మెంటల్ హెడ్‌లను సర్క్యులర్‌లో కోరింది.

వీటికి ప్రసూతి సెలవు ప్రయోజనాలు

ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ కనీసం 40 శాతం వైకల్యం ఉన్న మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు వారి మొత్తం సేవా వ్యవధిలో గరిష్టంగా 730 రోజుల పిల్లల సంరక్షణ సెలవులను అందించాలని నిర్ణయించింది.

నవంబర్‌లో 2 ప్రత్యేక సెలవులు

హిమంత బిస్వా శర్మ ప్రభుత్వం అస్సాం ఉద్యోగులకు సెలవు బహుమతిని కూడా ఇచ్చింది. అస్సాం ప్రభుత్వం తన ఉద్యోగులు వారి తల్లిదండ్రులు లేదా అత్తమామలతో సమయం గడపడానికి నవంబర్‌లో రెండు రోజుల ప్రత్యేక క్యాజువల్ సెలవును ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) గురువారం తెలిపింది. ప్రత్యేక సెలవులను వ్యక్తిగత ఆనందం కోసం ఉపయోగించలేరు. తల్లిదండ్రులు లేదా అత్తమామలు లేని వారు ఈ సెలవులకు అర్హులు కాదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు నవంబర్‌లో 6, 8వ తేదీల్లో ఈ ప్రత్యేక సెలవులను ప్రకటించింది. తల్లిదండ్రుల సంరక్షణ, వారిని గౌరవించడం, వారితో గడపడం కోసం మాత్రమే సెలవులను వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇది కాకుండా, 9వ తేదీ శనివారం, 10వ తేదీ ఆదివారం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..