Term Insurance: టర్మ్‌ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

|

Jun 25, 2022 | 12:28 PM

రోజులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ముఖ్యంగా మహమ్మారి నేపథ్యంలో నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ పెరిగింది...

Term Insurance: టర్మ్‌ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
Insurance
Follow us on

రోజులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ముఖ్యంగా మహమ్మారి నేపథ్యంలో నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ పెరిగింది. తాము లేకున్నా కుటుంబం సంతోషంగా ఉండాలని చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా టర్మ్‌ పాలసీలు వారికి మొదటి ప్రాధాన్యంగా కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ పాలసీలు కొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తున్నాయి. పాలసీ తీసుకునేటప్పుడే మీ అవసరాలకు తగ్గట్లుగా పాలసీని ఎంచుకోవాలి. చెల్లించిన ప్రీమియానికి పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. సాధారణంగా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ కొనసాగుతూ ఉండాలంటే.. క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. కొన్నిసార్లు వ్యవధి తీరిన తర్వాత కొన్ని రోజుల పాటు అదనపు గడువు లభిస్తుంది. అప్పటికీ ప్రీమియం చెల్లించకపోతే.. నిబంధనల మేరకు బీమా రక్షణ రద్దవుతుంది.

ఆర్థికంగా కాస్త ఇబ్బందులు వచ్చినప్పుడు ఇది చిక్కు సమస్యే. కొత్తతరం పాలసీలు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నాయి. వైద్యపరమైన కారణాల వల్ల ఊహించని ఖర్చుల వల్ల ప్రీమియం చెల్లించలేని పరిస్థితి వచ్చినప్పుడు ప్రీమియం చెల్లింపును తాత్కాలికంగా నిలిపి వేసేందుకు వెసులుబాటు కల్పిస్తున్నాయి. దీనివల్ల దీర్ఘకాలం పాటు ఆర్థిక రక్షణ పొందాలనుకునే వారికి పాలసీదారులు.. కొంతకాలం ప్రీమియం చెల్లించకున్నా రక్షణ ఉంటుంది. దీనివల్ల ప్రీమియం చెల్లించే వీలు కుదిరినప్పుడు మళ్లీ కొత్త పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పాత పాలసీకి ప్రీమియం చెల్లించి, దానిని తిరిగి యాక్టివేట్‌ చేసుకోవచ్చు. పాత కాలపు టర్మ్‌ పాలసీల్లో.. పాలసీదారుడికి ఏదైనా జరిగినప్పుడు నామినీకి వెంటనే పాలసీ విలువ మేరకు పరిహారం చెల్లించేవారు. ఇప్పుడు కొత్త పాలసీలు పరిహారం చెల్లింపు విధానాన్ని అందించడంలో వినూత్న మార్పులు చేశాయి.