Shema Electric Scooters: తక్కువ ధరలో హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్..
మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా స్కూటర్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ విభాగంలో ఓలా, ఏథర్ వంటి కంపెనీలు తమ సత్తా చాటుతున్నాయి. దీంతో మరిన్ని కంపెనీలు ఈ సెక్టార్ లోకి అడుగుపెడుతూ తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఇప్పటికే ఇండియాలో మంచి పేరున్న షేమా ఎలక్ట్రిక్ తన హై స్పీడ్ స్కూటర్లను లాంచ్ చేసింది. టఫ్ ప్లస్, ఈగల్ ప్లస్ పేరుతో ఇవి మన దేశీయ మార్కెట్లోకి వచ్చాయి.
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ షేమా ఈ-వెహికల్ అండ్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్ఈఎస్) మరో రెండు కొత్త స్కూటర్లను ఇండియాలో లాంచ్ చేసింది. హై స్పీడ్ తో పాటు అధిక సామర్థ్యం కలిగిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల పేర్లు ఈగల్ ప్లస్, టఫ్ ప్లస్. ఎకో ఫ్రెండ్లీగా అడ్వాన్స్ డ్ ఫీచర్లతో పాటు అతి తక్కువ ధరకే ఈ స్కూటర్లను అందుబాటులో ఉంచింది. దేశంలో షేమాకు బలమైన డీలర్ నెట్ వర్క్ తో పాటు అధిక ఉత్పత్తి భాగస్వాములు ఉన్న నేపథ్యంలో దేశంలో తమ సరికొత్త ట్రెండ్ సృష్టించేందకు సమాయత్తమవుతోంది. ఈ స్కూటర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా స్కూటర్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ విభాగంలో ఓలా, ఏథర్ వంటి కంపెనీలు తమ సత్తా చాటుతున్నాయి. దీంతో మరిన్ని కంపెనీలు ఈ సెక్టార్ లోకి అడుగుపెడుతూ తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఇప్పటికే ఇండియాలో మంచి పేరున్న షేమా ఎలక్ట్రిక్ తన హై స్పీడ్ స్కూటర్లను లాంచ్ చేసింది. టఫ్ ప్లస్, ఈగల్ ప్లస్ పేరుతో ఇవి మన దేశీయ మార్కెట్లోకి వచ్చాయి.
టఫ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మల్టీ యుటిలిటీ ఈవీ లోడర్ గా వ్యవహరిస్తోంది. 150కేజీల బరువును సులువుగా మోయగలుగుతుంది. గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. అదే సమయంలో ఈగల్ ప్లస్ విద్యుత్ ద్విచక్ర వాహనం గరిష్టంగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రెండు స్కూటర్లలోనూ అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. బ్లూటూత్ స్పీకర్లు, యాంటీ థెఫ్ట్ అలారమ్స్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్స్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఈగల్ ప్లస్ స్కూటర్లో సన్ మోబిలిటీకి చెందిన ఐపీ67 వాటర్ ప్రూఫ్ స్వాపబుల్ బ్యాటరీ ఉంటుంది. చాలా తక్కువ ధరకే ఇది లభిస్తుంది. ముఖ్యంగా లాస్ట్ మైల్ డెలివరీలకు చాలా ప్రయోజనకరంగా ఇవి ఉంటాయి.
ధర, లభ్యత..
ఈగల్ ప్లస్, టఫ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు షేమాకు చెందిన డీలర్ షోరూంలలో దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. టఫ్ ప్లస్ ప్రారంభ ధర రూ. 1,39,999కాగా, ఈగల్ ప్లస్ ప్రారంభ ధర రూ. 1,17,199(ఎక్స్ షోరూం)గా ఉంటుంది. రాష్ట్రంలోని సబ్సీడీలకు బట్టి రేటు మరింత తగ్గే అవకాశం ఉంది.
షేమా ఎలక్ట్రిక్ ఫౌండర్ అండ్ సీఈఓ యోగేష్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎలక్ట్రిక్ మోబిలిటీని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు తాము సైతం ముందుడుగు వేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా తక్కువ ఇంధన వనరులను వినియోగిస్తూ , అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చకుంటూ ముందుకుసాగుతన్నట్లు చెప్పారు. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న హై స్పీడ్ స్కూటర్ల డిమాండ్ కు అనుగుణంగా తమ రెండు స్కూటర్లను లాంచ్ చేసినట్లు చెప్పారు. తమ డీలర్ పార్టనర్స్, డిస్ట్రిబ్యూటర్స్, మార్కెట్ ప్లేసెస్ లో 20,000 పైగా స్కూటర్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..