Silver Price Drop: ఇప్పుడు కొనలేదో కచ్చితంగా ఫీల్‌ అవుతారు.. రూ.8 వేలు తగ్గిన వెండి ధర.. మిస్సవ్వకండి

Silver Prize Drop: గత కొన్ని రోజులుగా గోల్డ్‌ తరహాలోనే వెండి కూడా కొండెక్కి కూర్చుంది. బంగారం రేట్లు ఎలా పెరిగితే వెండి కూడా అదే రీతిలో పెరుగుతూ వెళ్లింది. దివాళికి ముందు ముట్టుకుంటే అంటుకునేలా ఉన్న వెండి ధర ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. కేజీ పై ఏకంగా రూ.8 వేలు తగ్గింది. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్‌లో వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దం పదండి.

Silver Price Drop: ఇప్పుడు కొనలేదో కచ్చితంగా ఫీల్‌ అవుతారు.. రూ.8 వేలు తగ్గిన వెండి ధర.. మిస్సవ్వకండి
Silver Prize Drop

Updated on: Oct 21, 2025 | 9:34 PM

వెండి ప్రియులకు ఇదొక గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే పండగకు ముందు ముట్టుకుంటే అంటుకునేలా ఉన్న వెండి ధర ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. కేజీపై ఏకంగా రూ.8 వేలు తగ్గి భారత మార్కెట్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,64, 000 లకు చేరుకుంది. తాజాగా తగ్గింపు తర్వాత హైదరాబాద్‌లో వెండి ధరలు చూసుకుంటే మార్కెట్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,82,000గా కొనసాగుతుంది.

ఇక దేశంలో ప్రధాన నగరాల్లో వెండి ధరలు

  • ముంబైలో కేజీ వెండి ధర రూ. 1,64,000
  • ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 1,64,000
  • చెన్నైలో కేజీ వెండి ధర రూ. 1,82,000
  • విజయవాడలో కేజీ వెండి ధర రూ. 1,82,000
  • కోల్‌కతాలో కేజీ వెండి ధర రూ. 1,64,000

అక్టోబర్ మధ్యలో ఔన్సు వెండి ధరలు $50 దాటాయి. అయితే, గత వారం చివర్లో అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడంతో దీని బ్రేక్ పడింది. అక్టోబర్ 17న అమెరికాలో వెండి ధరలు 6 శాతానికి పైగా తగ్గడం అక్టోబర్ 20న భారత మార్కెట్‌లోని ETFలపై ప్రభావం పడింది. దీంతో దేశంలో ఒక కిలో వెండి ధర దాదాపు 7 శాతం తగ్గి రూ.1,72,000 నుండి రూ.1,64,000కి చేరుకుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.