Share Market News: ఐదవ రోజు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. 1,145 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ సెన్సెక్స్.. 49,744 స్థిరపడింది. నిఫ్టీ 306 పాయింట్ల కోల్పోయి 14,706 వద్ద ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. దీంతో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు.
రోజు ఎలా ఉంటుందోననే భయం వారిలో వ్యక్తమవుతోంది. అయితే.. గత కొంత కాలంగా స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ ప్రయత్నం జరిగి. సూచిల్లో కొత్ పడిందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. మహారాష్ట్రలోని రెండు నగరాల్లో లాక్‌డౌన్ ప్రకటన కూడా ప్రతికూల సెంటిమెంట్‌కు కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే వారం మొదట్లొ మార్కెట్ తిరిగి పుంజుకునే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, దేశీయంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతుండటం వంటివి మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీనితో వారంతా అమ్మకాలపై దృష్టి సారించడం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఐటీ, ఆటో, ఫార్మా, బ్యాంకింగ్ షేర్లు కుదేలవ్వడం కూడా నష్టాలకు మరో కారణంగా భావిస్తున్నారు.
Breaking News: ముంబైలో ఎంపీ ఆత్మహత్య..