
బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఆగస్ట్ నెల ముగిసి సెప్టెంబర్ నెల రాబోతుంది. దీంతో బ్యాంక్ సెలవులు కూడా మారుతున్నాయి. కొత్త నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో మూతపడతాయనేది తెలుసుకోవడం ముఖ్యం. దీని వల్ల ముందుగానే బ్యాంక్ లావాదేవీలను ప్లాన్ చేసుకోవచ్చు. సెప్టెంబర్‌లో తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ సంఘాలు సమ్మెకు దిగుతున్నాయి. ఈ మేరకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాక్ యూనియన్స్ సమ్మెకు పిలపునిచ్చింది. సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఐదు రోజుల వర్కింగ్ డేస్ అమలు చేయడంతో పెన్షన్లలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనలు చేపట్టనున్నారు. దీంతో ఆ రోజు కూడా బ్యాంకులు మూతపడే అవకాశముంది. ఇక సెప్టెంబర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి లాంటి అనేక పండుగలు వచ్చాయి. ఈ కారణంతో బ్యాంకులు ఎక్కువ రోజుల పాటు మూతపడనున్నాయి.
-సెప్టెంబర్ 4న శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. ఏపీ, తెలంగాణలో కూడా బంద్ కానున్నాయిః
-సెప్టెంబర్ 6న ఆదివారం సందర్భంగా సాధారణ సెలవు
సెప్టెంబర్ 11న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కారణంగా బ్యాంక్ సేవల్లో అంతరాయం
-సెప్టెంబర్ 12న రెండో శనివారం కావడంతో బ్యాంకులు ఉండవు
-సెప్టెంబర్ 13న ఆదివారం బ్యాంకులు పనిచేయవు
-సెప్టెంబర్ 14న వినాయక చవితి సందర్బంగా బ్యాంకులకు సెలవు దినం
-సెప్టెంబర్ 15న గణేశ్ చతుర్ధి రెండో రోజు సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు ఉండవు
-సెప్టెంబర్ 20న ఆదివారం రోజున బ్యాంకులకు సాధారణ సెలవు
-సెప్టెంబర్ 21న సోమవారం శ్రీమంత శంకర్ దేవ్ జన్మదినం సందర్భంగా భువనేశ్వర్, తిరువనంతపురంలో బ్యాంకులు బంద్ అవుతాయి
-సెప్టెంబర్ 26 నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులు బంద్
-సెప్టెంబర్ 27 ఆదివారం బ్యాంకులు ఉండవు
అయితే బ్యాంక్ సెలవులు అనేది రాష్ట్రం, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పండుగలు ఉంటాయి. దీంతో ఒక ప్రాంతంలో సెలవు ఉంటే.. మరొక ప్రాంతంలో సెలవు వర్తించదు. దీంతో మీరు బ్యాంక్‌కు వెళ్లాలనుకున్నప్పుడు ఒకసారి బ్రాంచ్ సిబ్బందిని సంప్రదించి కన్ఫార్మేషన్ తీసుకోవడం మంచిది. అయితే బ్యాంకులు మూతపడితే కేవలం బ్యాంక్ సంబంధిత కార్యకలాపాలు మాత్రమే నిలిచిపోతాయి. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. కేవలం చెక్కుల క్లియరెన్స్ సేవలు వంటి నిలిచిపోతాయని చెప్పవచ్చు.