కేంద్ర ప్రభుత్వానికి నెల నెల జీఎస్టీ వసూళ్లు భారీగానే పెరిగిపోతున్నాయి. ప్రతి నెల అధిక మొత్తంలో గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) పెరుగుదలతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చి చేరుతుంది. అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాలకు కూడా మంచి ఆదాయమే వస్తోంది. సెప్టెంబర్ నెల జీఎస్టీ వసూళ్ల సమాచారం వెలువడింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1,62,712 కోట్లు వచ్చినట్లు గణాంకాంలు చెబుతున్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం (2023-24), ఏప్రిల్ నెల నుంచి నెల వారీ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ( జీఎస్టీ) వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు దాటడం ఇది నాలుగోసారిగా నివేదికలు పేర్కొంటున్నాయి. గత ఆరు నెలల్లో నాలుగు సార్లు జీఎస్టీ వసూళ్లు రూ.1.6 లక్షల కోట్ల మార్కును దాటినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఆరు నెలల్లో మొత్తం పన్ను వసూళ్లు రూ.9,92,508 కోట్లు. ప్రభుత్వానికి కనీసం 10 లక్షల కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు వచ్చాయి.
ఈ ఐజీఎస్టీ మొత్తంలో కేంద్రానికి రూ.33,736 కోట్లు రాగా, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.27,578 కోట్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని తో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ( GST) మొత్తం వాటా ఈ కింది విధంగా ఉంది:
అత్యధిక జీఎస్టీ వసూళ్లు సాధించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటకలు ముందుగా ఉన్నాయి. అయితే తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు కూడా సమీపంలోనే ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అత్యధిక గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లు ఉన్న 10 రాష్ట్రాల జాబితా ఇలా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి