బుల్ వస్తే..ఈ సంవత్సరాంతానికి 61 వేల పాయింట్ల స్థాయికి సెన్సెక్స్, అమెరికాలోని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషణ , ఇండియాలో పరిస్థితి మెరుగుదలపై ఆశాభావం

| Edited By: Anil kumar poka

May 19, 2021 | 8:40 PM

బుల్ వచ్చిన పక్షంలో ఇండియాలో ఈ సంవత్సరాంతానికి సెన్సెక్స్ 61 వేలపాయింట్లకు చేరవచ్చునని అమెరికాలోని బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ విశ్లేషించింది. ప్రస్తుతం ఇది 50 వేల పాయింట్లు ఉందని, అయితే 2021 చివరకు అంటే డిసెంబరు నాటికీ ఇది 61 వేలకు చేరవచ్చునని...

బుల్ వస్తే..ఈ సంవత్సరాంతానికి 61 వేల పాయింట్ల స్థాయికి సెన్సెక్స్, అమెరికాలోని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషణ , ఇండియాలో పరిస్థితి మెరుగుదలపై ఆశాభావం
Follow us on

బుల్ వచ్చిన పక్షంలో ఇండియాలో ఈ సంవత్సరాంతానికి సెన్సెక్స్ 61 వేలపాయింట్లకు చేరవచ్చునని అమెరికాలోని బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ విశ్లేషించింది. ప్రస్తుతం ఇది 50 వేల పాయింట్లు ఉందని, అయితే 2021 చివరకు అంటే డిసెంబరు నాటికీ ఇది 61 వేలకు చేరవచ్చునని ఈ సంస్థ అంచనా వేసింది. ఇండియా ఇప్పుడు ప్రధానంగా రెండు సవాళ్ళను ఎదుర్కొంటోందని పేర్కొంది. ముఖ్యంగా వ్యాక్సిన్ల కొరత ఒకటి కాగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ప్రజలకు నచ్ఛజెప్పడం మరొకటని అభిప్రాయపడింది. వ్యాక్సిన్ సప్లయ్ లో అతి ప్రధానమైన ఇన్ ఫుట్ షిఫ్ట్ అవుతున్నట్టు ఈక్విటీ మార్కెట్ భావిస్తోందని, ముందుముందు దీని ప్రభావాన్ని మదింపు చేస్తోందని ఈ సంస్థ పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గడం, రికవరీ రేటు పెరగడం, అంతర్జాతీయ ప్రోత్సాహకాలు సెన్సెక్స్ ఈ స్థాయికి చేరడానికి దోహదపడతాయని మోర్గాన్ సంస్థ అభిప్రాయపడింది. మొత్తానికి ఏడాది చివరకు బుల్ పరిస్థితుల్లో ఇది ఈ సాయికి పెరగడమే కాక..బేర్ 41 వేల పాయింట్లకు చేరవచ్చునని అంచనా అని వివరించింది. ఇన్వెస్టర్లు ఇప్పటినుంచే ఆశగా చూస్తున్నారని కూడా పేర్కొంది.

దేశంలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ద్రవ్య సంబంధ కన్సాలిడేషన్ వంటి చర్యలతో బాటు అమెరికా డాలర్ స్థిరీకరించిన బేర్ మార్కెట్ లో ప్రవేశించడం మరింతగా ఉపకరించే సూచనలున్నాయి అని మోర్గాన్ సంస్థ వివరించింది. మొత్తానికి ఇండియాలో వచ్చే ఏడాది ఆర్ధిక సంవత్సరంలో ఆదాయ వృద్డి 37 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని స్థూలంగా ఎనలైజ్ చేసింది.

మరిన్ని చదవండి ఇక్కడ : Lockdown Violation : నాగిని డ్యాన్స్‌ వేపించిన పోలీసులు…వైరల్ అవుతున్న వీడియో.లాక్ డౌన్ నియమాలు అతిక్రమిస్తే ఇక అంతే ..

ఒక్క ఫోన్ చేస్తే చాలు..స్కార్పియో అంబులెన్స్ ఫ్రీ సర్వీస్..ఎక్కడంటే.. సొంత వాహనాన్ని పబ్లిక్ సర్వీస్ కు అంకితం చేసిన యువకుడు ..:viral video.

ప్రాణాలకు తెగించి నన్ను కాపాడాడు అంటున్న లెక్కల మాస్టర్ సుకుమార్..! Allu Arjun Saved Sukumar Life video.