Stock Market: స్టాక్‌ మార్కెట్‌పై పంజా విసురుతున్న బేర్‌.. జీవితకాల కనిష్ఠాలకు పడిపోతున్న స్టాక్స్‌..

|

Jun 18, 2022 | 11:44 AM

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, కరోనా భయాలతో స్టాక్‌ మార్కెట్‌లో అస్థిరత కొనసాగుతోంది. ఈ వారంలో స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది. ఈ వారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ దాదాపు 3 వేల పాయింట్లు క్షీణించింది...

Stock Market: స్టాక్‌ మార్కెట్‌పై పంజా విసురుతున్న బేర్‌.. జీవితకాల కనిష్ఠాలకు పడిపోతున్న స్టాక్స్‌..
Stock Market
Follow us on

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, కరోనా భయాలతో స్టాక్‌ మార్కెట్‌లో అస్థిరత కొనసాగుతోంది. ఈ వారంలో స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది. ఈ వారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ దాదాపు 3 వేల పాయింట్లు క్షీణించింది. ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపు, ఇప్పుడు US ఆర్థిక వ్యవస్థలో మందగమనానికి బలమైన అవకాశం ఉండడం వంటి అంశాల ప్రభావంతో ఈ వారం సెన్సెక్స్‌లో 2943 పాయింట్ల భారీ క్షీణత నమోదు కాగా, గత వారం 1466 పాయింట్లు తగ్గింది. ఈ వారం సెన్సెక్స్ 51360 స్థాయి వద్ద, నిఫ్టీ 15293 స్థాయి వద్ద ముగిశాయి. నిఫ్టీ మరింతగా 411 పాయింట్ల మేర పతనమైతే.. స్టాక్ మార్కెట్ బేరిష్ జోన్‌లోకి ప్రవేశిస్తుందని, ఇది గడ్డు పరిస్థితి అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. గత రెండేళ్లుగా వారానికోసారి చెత్త పనితీరు కనబరుస్తున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ బేరిష్ జోన్ లోకి వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ 14882 దిగువన జారిపోతే అది బేర్ మార్కెట్ అవుతుంది.

నిఫ్టీలో ప్రస్తుతం, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బిఐ కార్డ్, ఎల్‌ఐసి, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌ఎండిసి వంటి దిగ్గజాలు ఉన్నాయి. ఈ స్టాక్‌లు క్షీణిస్తూనే ఉన్నాయి. నిఫ్టీ కూడా 15500 బలమైన మద్దతును బ్రేక్ చేసిందని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్‌కు చెందిన అనూజ్ గుప్తా తెలిపారు. “ఇప్పుడు మార్కెట్‌కు తదుపరి బలమైన మద్దతు 15000 స్థాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి చూస్తే నిఫ్టీ 14800, 14600 స్థాయికి ఎగబాకే అవకాశం ఉంది. నిఫ్టీ స్వల్పకాలంలో 15000-15700 రేంజ్‌లో ట్రేడవుతుందని అంచనా. దిగువ స్థాయిలలో కొనుగోలుదారులు ఆధిపత్యం చెలాయిస్తే, మొదటి లక్ష్యం 15900 మరియు 15700 స్థాయిని విచ్ఛిన్నం చేస్తే 16200. 15000 స్థాయిని విచ్ఛిన్నం చేస్తే నిఫ్టీ సులభంగా 14800 స్థాయికి జారుతుంది” అని చెప్పారు.