చమురు ధరల పెరుగుదలతో స్టాక్‌మార్కెట్లు(Stock Market) వరుసగా రెండో రోజు నష్టాలను చవిచూశాయి. గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్(Sensex) 89 పాయింట్లు పతనమై 57,596 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ(Nifty) 23 పాయింట్లు తగ్గి 17,223 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.59 శాతం, స్మాల్ క్యాప్ షేర్లు 0.43 శాతం పెరిగాయి. నిఫ్టీ బ్యాంక్ 1.72, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1.62, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.56 శాతం వరకు పడిపోయాయి.
నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఫార్మా లాభపడ్డాయి. టైటాన్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకులు నష్టపోయాయి. 1,448 కంపెనీల షేర్లు పెరగ్గా, బిఎస్‌ఇలో 1,940 కంపెనీల షేర్లు తగ్గాయి. డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, NTPC లాభపడ్డాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు 16.83 శాతం మేర పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ వివాదం ఇంకా కొనసాగుతుండడంతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు120 డాలర్ల కంటే ఎక్కువగా ట్రేడ్ అయింది.
Read Also .. CNG Gas Prices: Another shock to consumers .. Increased CNG, PNG gas prices .. Since when?